Physical Exam for SI posts: పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో దేహదారుఢ్య పరీక్షలు
సాక్షి ఎడ్యుకేషన్: గుంటూరు నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ఎస్‌ఐ అభ్యర్థుల దేహ దారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గుంటూరు రేంజ్ ఐజీ జి. పాల్‌రాజు పర్యవేక్షించారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థుల ధ్రువపత్రాల్ని సిబ్బంది కూలంకుషంగా పరిశీలించారు. బయోమెట్రిక్, ఎత్తు, ఛాతీ కొలతల వివరాల్ని నమోదు చేసుకున్నారు. అనంతరం 100 మీటర్ల, 1,600 మీటర్ల పరుగు పోటీలు, లాంగ్‌జంప్ పోటీలు నిర్వహించారు.
Odissa Academy: ఒడిశా పాయికా అకాడమీకి ముఖ్యమంత్రి ఆమోదం
650 మంది అభ్యర్థులు హాజరవ్వగా, 304 మంది అర్హత సాధించారు. ఒంగోలు పీటీసీ ప్రిన్సిపాల్ దామోదర్, ఏఎస్పీలు కె.సుప్రజ (గుంటూరు), మహేష్ (బాపట్ల) పర్యవేక్షించారు. కార్యక్రమంలో డీఎస్పీలు రవిచంద్ర (దిశ పీఎస్, పల్నాడు జిల్లా), చంద్రశేఖర్ (గుంటూరు ఏఆర్), ఐజీ కార్యాలయ సీఐ సుధాకర్, పోలీస్ అధికారులు, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు.