AP School Buses: పాఠ‌శాల విద్యార్ధుల‌కు ఉచిత ప్ర‌యాణం

విద్యార్థులు త‌మ పాఠ‌శాల‌కు చేరుకునేందుకు ప్ర‌భుత్వం వారికి ఉచిత బ‌స్సుల ఏర్పాటు చేసింది. త‌మ చ‌దువుకు ఎటువంటి ఇబ్బందులు క‌ల‌గ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ బ‌స్సులను ఏర్పాటు చేసార‌ని తెలిపారు. ఈ బ‌స్సులకు సంబంధించిన ప్ర‌యాణ పాసుల‌ను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నామ‌న్నారు.
Students at Nandaluru bus stop

సాక్షి ఎడ్యుకేష‌న్: చదువు భారం కాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోంది. యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, బూట్లు, స్కూల్‌ బ్యాగులు వంటి అవసరాలు తీరుస్తూ జగనన్న విద్యాకానుక పేరిట అందిస్తోంది. రుచికరకమైన మధ్యాహ్నభోజనం జగనన్న గోరుముద్ద పేరిట అమలు చేస్తోంది. మనబడి నాడు–నేడుతో పాఠశాలకు అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తోంది. తమ నివాసాలకు సుదూరంగా ఉండే ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్ధులకు ఉచిత రవాణా సదుపాయం కూడా కల్పిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 13,332 మంది పాసులు మంజూరు చేయగా, 463 షెడ్యూల్‌ సర్వీసులను విద్యార్థుల కోసం రోడెక్కిస్తున్నారు.

Teacher: ఉపాధ్యాయ బదిలీలు నిలిపివేయాలి

బాలికలకు బస్సు పాసు పూర్తిగా ఉచితం

ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే బాలికలకు ఆర్టీసీ బస్సులో పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. 1 నుంచి 7 వరకు చదివే బాలురకు కూడా పూర్తిగా ఉచితంగా బస్సు పాసులు మంజూరు చేస్తోంది. పాఠశాలలకు వెళ్లే సమయంలో వివిధ రూట్లలో షెడ్యూల్‌ బస్సు లేని పక్షంలో వారి కోసం ప్రత్యేకంగా బడి బస్సు పేరిట సర్వీసులను నడుపుతున్నారు. పాసులు ఉన్న ప్రతి విద్యార్ధి ఈ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తూ విద్యార్ధులను సమయానికి పాఠశాలలకు తీసుకెళుతున్నారు.

Lecturer Jobs: లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

రాయితీతో..

7 నుంచి ఆపై తరగతులు చదివే బాలురకు, ఉన్నత చదువులు చదివే బాలికలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం రాయితీతో కూడిన పాసులను మంజూరు చేస్తున్నారు. ఈ పరిస్ధితి వల్ల విద్యార్ధులకు కొంతమేర ఉపశమనం కలుగుతుంది.

దాతలసహకారంతో...

విద్యార్థులకు ప్రభుత్వం ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించగా పాసులు ప్రింటింగ్‌, లామినేషన్‌ తదితర ఖర్చు కోసం విద్యార్థులు రూ.57 చెల్లించాల్సి ఉంటుంది. వారికి అది కూడా భారం కాకుడూదనే లక్ష్యంతో ఆర్టీసీ అధికారులు దాతల సహకారం తీసుకుంటున్నారు. కొంతమంది దాతలను సంప్రందించి పేద విద్యార్ధులను దృష్టిలో ఉంచుకొని పాసులకు అయ్యే మొత్తాన్ని చెల్లించేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా జిల్లాలోని రాయచోటి, రాజంపేట, మదనపల్లె–1, మదనపల్లె–2, పీలేరు డిపోల్లో డీఎంలు కృషిచేస్తున్నారు.

Jobs: గురుకుల అభ్యర్థులకు ఈ తేదీ వరకు ఆప్షన్‌ అవకాశం

సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వం ఉచితంగా అందచేస్తున్న బస్సు పాసులను విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలి. క్రమశిక్షణతో పాఠశాలను చేరుకుని అంకితభావంతో చదవి లక్ష్యాన్ని సాధించాలి. ఉచిత ప్రయాణం పొందే ప్రతి విద్యార్ధి ఉన్నతస్థానాలకు చేరుకోవడం ద్వారా తమ కల్పించిన సౌకర్యానికి సార్థకత చేకూర్చాలి.

                –రాము, జిల్లా ప్రజారవాణా అధికారి, రాయచోటి

Sports Competitions: అథ్లెటిక్స్‌లో ఉపాధ్యాయుల ఉత్సాహం

ఉచితపాసుల విద్యార్థులకు సకాలంలో సర్వీసులు

ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత పాసులు జారీ చేస్తున్న క్రమంలో అసౌకర్యాలు లేకుండా అందజేస్తున్నాము. పాఠశాల వేళల సమయానికి అనుకూలంగా సర్వీసులను తిప్పుతున్నాం. అవసరాన్ని బట్టి బడి బస్సు పేరిట బస్సును నడుపుతున్నాం. ప్రభుత్వం అందిస్తున్న ఉచితబస్‌పాసును సద్వినియోగం చేసుకోని సకాలంలో బడికి వెళ్లి విద్యావంతులు కావాలి.

          –రమణయ్య, డిపోమేనేజరు, రాజంపేట

#Tags