Holidays: నేటి నుంచి ట్రిపుల్ ఐటీ, ఇంటర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు.. ఎప్పటివరకంటే..
ఆంధ్రప్రదేశ్‌లోని ట్రిపుల్ ఐటీ, ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.
రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న ట్రిపుల్ ఐటీలు, ఇంటర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. తిరిగి జనవరి 18వ తేదీ కాలేజీలు పునఃప్రారంభం అవుతాయి.
ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీలు అన్నీ తప్పకుండా సెలవులు ఇవ్వాలని, క్లాసులు నిర్వహిస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. జనవరి తొమ్మిదవ తేదీ నుంచే స్కూళ్లకు సెలవులు ప్రారంభమైన విషయం తెలిసిందే. అలాగే తెలంగాణలో ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకూ ఇంటర్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే 6,795 స్పెషల్ బస్సులను సిద్ధం చేసింది.
School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సెలవులు పొడిగింపు.. ఎన్నిరోజులో తెలుసా..
#Tags