Open School Examination Fee: 21 వరకు ఓపెన్‌ స్కూల్‌ పరీక్ష రుసుము చెల్లింపు గడువు

సప్తగిరికాలనీ: ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్ష రుసుము ఈనెల 12 నుంచి 21వరకు చెల్లించవచ్చని సప్తగిరికాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కోఆర్డినేటర్‌ ఎ.శంకరయ్య తెలిపారు.

టెన్త్‌ ఒక సబ్జెక్టుకు రూ.100, ఇంటర్‌ ఒక సబ్జెక్టుకు రూ.150 చెల్లించాలని అన్నారు. గతంలో ఉత్తీర్ణులు కానీ వారు కూడా పరీక్షా ఫీజు చెల్లించి ఏప్రిల్‌లో జరిగే వార్షిక పరీక్షలు వ్రాయవచ్చునని తెలిపారు. రూ.25 అపరాధ రుసుముతో ఈ నెల 27 వరకు, రూ.50 అపరాధ రుసుంతో మార్చి 4 వరకు చెల్లించవచ్చునని తెలిపారు. పరీక్ష ఫీజు మీ సేవ కేంద్రం, తెలంగాణ స్టేట్‌ ఆన్‌లైన్‌ సెంటర్‌ లేదా ఓపెన్‌ స్కూల్‌ కో ఆర్డినేటర్‌ కు చెల్లించగలరని పూర్తి వివరాలకు 9849114956 ను సంప్రదించాలని పేర్కొన్నారు.

#Tags