Notification for Gurukul Admissions 2024: బీసీ గురుకుల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.. దరఖాస్తు వివరాలు ఇలా..!
రాయవరం: మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు సమయం ఆసనమైంది. 2024– 25 విద్యా సంవత్సరంలో బీసీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లావ్యాప్తంగా ఉన్న తొమ్మిది పాఠశాలల్లో 440 మందికి ప్రవేశాలు లభించనున్నాయి. బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల ప్రవేశానికి ఈ నెల ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకూ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరించేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Training and Job Offer: స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ భాషపై శిక్షణ
బాలురు, బాలికలకు వేర్వేరుగా..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతి గృహాలు ఉన్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం వద్ద ఉన్న సమనస బాలుర పాఠశాలలో 80, రామచంద్రపురం బాలికల పాఠశాలలో 40 సీట్లు ఉన్నాయి. కాకినాడ జిల్లా కరప బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో 80, తుని బాలుర పాఠశాలలో 40, పెద్దాపురం బాలుర పాఠశాలలో 40 సీట్లు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బాలుర గురుకుల పాఠశాలలో 40, రాజమహేంద్రవరం బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో 40, కొవ్వూరు బాలుర ఉన్నత పాఠశాలలో 40, గోపాలపురం బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో 40 సీట్లు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 440 సీట్లకు ఎంట్రన్స్ నిర్వహిస్తారు. కోనసీమ జిల్లా సమనస పాఠశాలలో 40 శాతం (32 సీట్లు) మత్స్యకారులకు మాత్రమే కేటాయిస్తారు.
Tenth Class Public Exams 2024: పదోతరగతి పరీక్షల్లో ప్రణాళికతో సాధన చేస్తే మెరుగైన ఫలితాలు ....
ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నపత్రం
ఐదవ తరగతిలో ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశానికి సంబంధించి ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. గతంలో లాటరీ పద్ధతిలో ప్రవేశాలు కల్పించగా, మూడేళ్లుగా ఎంట్రన్స్ నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. 4వ తరగతి స్థాయి పరీక్ష ఉంటుంది. ఇంగ్లిషు, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులపై 50 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నపత్రం ఇస్తారు. తెలుగు–10, ఇంగ్లిషు–10, గణితం–15, సైన్స్, సోషల్ కలిపి 15 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. పరీక్షా సమయం రెండు గంటలు కాగా, విద్యార్థుల సమాధానాలను ఓఎంఆర్ షీట్లో గుర్తించాల్సి ఉంటుంది. జిల్లా యూనిట్‌గా ప్రవేశాలకు ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులకు వారి సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రం వివరాలను హాల్ టిక్కెట్‌లో తెలియజేస్తారు.
Gurukul School Entrance Exam: కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సాఫీగా సాగిన గురుకుల ప్రవేశ పరీక్షలు..
ఎంపిక విధానం ఇలా..
అర్హులైన విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరి, అభ్యర్థి కోరిన పాఠశాల ప్రాధాన్యతల ఆధారంగా ఎంపిక చేస్తారు. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఓసీ/ఈబీసీలకు రెండు శాతం, బీసీ–ఎ 20శాతం, బీసీ–బి 28శాతం, బీసీ–సీ మూడు శాతం, బీసీ–డీ 19శాతం, బీసీ–ఈ నాలుగు శాతం సీట్లు కేటాయిస్తారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు ఆరు శాతం, అనాథలకు మూడు శాతం సీట్లు కేటాయిస్తారు. ఏదైనా రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు లేకుంటే అటువంటి ఖాళీలను బీసీ కేటగిరి అభ్యర్థులకు కేటాయిస్తారు. సమానమైన ర్యాంక్ ఒకరి కంటే ఎక్కువ మందికి వచ్చినప్పుడు పుట్టిన తేదీ ప్రకారం అధిక వయస్సు ఉన్న వారికి ప్రాధాన్యమిస్తారు. సమానమైన ర్యాంకు వస్తే, గణితంలో పొందిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. అప్పుడు కూడా సమానమైన ర్యాంకు వస్తే పరిసరాల విజ్ఞానంలో పొందిన మార్కులను పరిగణలోనికి తీసుకుంటారు. ప్రవేశానికి ఎంపికైన వారికి మాత్రమే కాల్ లెటర్స్, ఫోన్ ద్వారా సమాచారం ఇస్తారు. మెరిట్ లిస్టు మార్కుల ఆధారంగా మొదటి, రెండవ, మూడవ జాబితాను ఖాళీలను బట్టి ప్రకటిస్తారు.
Tenth Class Public Exams 2024: పదోతరగతి పరీక్షల మూల్యాంకనంలో కోడింగ్ విధానం
రెసిడెన్షియల్ పాఠశాలల్లో లభించే సదుపాయాలు
ఉచిత వసతి, గురుకుల విధానంలో చదువుకునే అవకాశం. నెలకు రూ.1,400తో పౌష్టిక విలువలతో కూడిన భోజనం. నాలుగు జతల యూనిఫామ్, దుప్పటి, జంబుకాన, బూట్లు, సాక్స్, టై, బెల్ట్, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్‌ను జగనన్న విద్యాకానుక ద్వారా విద్యార్థులకు అందజేస్తారు. కాస్మోటిక్ చార్జీలు బాలురకు నెలకు రూ.125 (5,6 తరగతులు) 7వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదువుతున్న బాలురకు నెలకు రూ.150లు చెల్లిస్తారు. బాలురకు నెలకు సెలూన్ ఖర్చుల కింద రూ.50 వంతున ఖర్చు చేస్తారు. 6,7 తరగతులు చదువుతున్న వారికి నెలకు రూ.130, 8వ తరగతి నుంచి ఆపై తరగతులు చదువుతున్న బాలికలకు నెలకు రూ.250 వంతు చెల్లిస్తారు. 5వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థి ఇంటర్మీడియెట్ వరకు గురుకుల పాఠశాలల్లోనే విద్యను అభ్యసించవచ్చు. సమీకృత పౌష్టిక ఆహారం కింద ప్రతి రోజు వేరుశనగ చిక్కి, వారానికి ఆరు రోజులు కోడిగుడ్డు, వారానికి రెండు సార్లు చికెన్ కర్రీ ఇస్తారు. విద్యార్థులకు పూర్తి స్థాయి ఇంగ్లిషు మీడియంలో బోధన చేస్తారు. క్రీడలతో పాటుగా బోధనేతర కార్యక్రమాల్లో కూడా శిక్షణ ఇస్తారు. లైబ్రరీలు, ప్రయోగశాలలు, డిజిటల్ తరగతులతో విద్యాబోధన చేస్తారు.
Women Icon Award: వలంటీర్ జ్యోతికి ఉమెన్ ఐకాన్ అవార్డు
సీబీఎస్‌ఈ విధానం అమలు
గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఇంగ్లిషు మీడియం విద్య లభిస్తుంది. 9వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ అమలు చేస్తున్నాం. ప్రాథమిక తరగతుల్లో మంత్ర టీమ్ పర్యవేక్షణలో ప్రాథమిక భావనలను అభివృద్ధి చేయడానికి ప్రాజెక్టు బేస్డ్ లెర్నింగ్ అమలు పరుస్తున్నాం.
– డాక్టర్ వైటీఎస్ రాజు, ప్రిన్సిపాల్, ఎంజేపీఏపీబీసీడబ్ల్యుఆర్ స్కూల్
సమనస జిల్లా కన్వీనర్లు సెల్ నంబర్లు
కోనసీమ వైటీఎస్ రాజు 98661 95979
కాకినాడ ఎర్నస్ట్ సీకేపీ 94901 86560
తూర్పుగోదావరి సాయినాఽథ్ 94402 65787
Women Icon Award: ‘కందేపి’కి ఉమెన్ ఐకాన్ అవార్డు
దరఖాస్తు చేయాలిలా..
బీసీ, ఈబీసీ, ఇతర విద్యార్థులకు 9–11 సంవత్సరాల వయసు మించి ఉండాలి. 2013 సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి 2015 ఆగస్టు 31 తేదీ మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9–13 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. 2011 సెప్టెంబర్ ఒకటి నుంచి 2015 ఆగస్టు 31 మధ్యలో జన్మించి ఉండాలి. విద్యార్థులు జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశం పొందడానికి ఆ జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి. రెండేళ్లుగా నిరంతరంగా (2022–23, 2023–24) చదువుతూ ఉండాలి. విద్యార్థులు సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 4వ తరగతిలో 2023–24 విద్యా సంవత్సరంలో చదువుతూ ఉండాలి.
TS Govt Announces PRC: ఫిట్‌మెంట్ ప్రకటించిన ప్రభుత్వం.. సంబరాల్లో ఉద్యోగులు
అభ్యర్థులు అర్హతలు పరిశీలించుకుని దరఖాస్తు చేసుకున్న తర్వాత రూ.100 చెల్లించాలి. ఫీజు చెల్లించిన వారికి నంబర్‌ను కేటాయిస్తారు. ఆ నంబర్ ఆధారంగా ఆన్‌లైన్‌లో https://mjpapbcwreis.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నంబర్‌ను పరీక్ష ఫీజు చెల్లించిన వివరాలకు కేటాయించిన కాలమ్‌లో నమోదు చేయాలి.
ఈ నెల 31 తుది గడువు
విద్యార్థులు దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 31 తుది గడువు. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించిన తర్వాత ఒక రిఫరెన్స్ నంబర్‌ను ఇస్తారు. నింపిన దరఖాస్తు నమూనా కాపీని ప్రింట్ తీసుకుని ఉంచుకోవాలి. దరఖాస్తు సమయంలో అభ్యర్థి కుల ధ్రువీకరణ, ఆదాయం, పుట్టినతేదీ, ప్రత్యేక కేటగిరి ధ్రువీకరణ, స్టడీ, బోనఫైడ్ సర్టిఫికెట్ తదితర ధృపత్రాలు ఒరిజనల్ సర్టిఫికెట్లు కౌన్సిలింగ్ సమయంలో సమర్పించవలసి ఉంటుంది. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించరాదు. పరీక్ష తేదీకి ఏడు రోజులు ముందుగా విద్యార్థి రిఫరెన్స్ నంబర్ ద్వారా హాల్ టికెట్లు దగ్గరలోని ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Sainik School: ప్రశాంతంగా సైనిక్ స్కూల్ ప్రవేశపరీక్ష.. విద్యార్థుల హాజరు వివరాలు ఇలా
దరఖాస్తు నింపే సమయంలో ఈ సూచనలు పాటించాలి..
- దరఖాస్తును ఆన్‌లైన్‌లో నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తును పూరించాలి.
- పరీక్షా కేంద్రాన్ని దరఖాస్తుదారులు సొంత జిల్లాను మాత్రమే ఎంపిక చేయాలి.
- పాఠశాల ప్రాధాన్యతాక్రమం ఎంచుకోవడానికి ముందు పాఠశాలల పట్టిక చూసుకుని పూరించాలి. పాస్‌పోర్టు సైజ్ ఫొటోను సిద్ధం చేసుకోవాలి. దరఖాస్తు పూరించే సమయంలో జరిగే పొరపాట్లకు విద్యార్థిదే పూర్తి బాధ్యత.
- ఒకసారి దరఖాస్తును ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసిన తర్వాత ఎటువంటి మార్పులకు తావులేదు.