Tenth Class Public Exams 2024: పదోతరగతి పరీక్షల మూల్యాంకనంలో కోడింగ్ విధానం
రాయచోటి: పదోతరగతి పరీక్షల మూల్యాంకనంలో కోడింగ్ అత్యంత కీలకమని ఆర్‌జేడీ రాఘవరెడ్డి అన్నారు. ఆదివారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో పదోతరగతిలో కోడింగ్ విధానంపై రాయలసీమ స్థాయి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయలసీమలోని ఎనిమిది జిల్లాల విద్యాశాఖ అధికారులు, అసిస్టెంట్ కమిషనర్లు, చీఫ్ కోడింగ్ అధికారులు, అసిస్టెంట్ కోడింగ్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కడప ప్రాంతీయ సంచాలకులు రాఘవరెడ్డి మాట్లాడుతూ పదోతరగతి మూల్యాంకనంలో కోడింగ్ విధానంలో ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా, ఒక విద్యార్థి కూడా నష్టపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శిక్షణలో అనుమానాలు ఉంటే ఇక్కడే తీర్చుకోవాలని తెలియజేశారు. అనంతరం రీసోర్స్ పర్సన్ సుంకర రామకృష్ణ కోడింగ్ ప్రక్రియలో మొదటిరోజు నుంచి చివరి రోజు వరకు ఎలా చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
Tags
- Coding method in evaluation of class 10 examinations
- Guidelines of Tenth class
- sakshieducation latest news
- Guidelines of class 10 exams
- AP Tenth Class Exam
- Tenth Class Exam Dates 2024
- AP Tenth Class Public Exams
- Annamaiya district center event
- Coding techniques
- Rayalaseema awareness program
- Class 10 exam evaluation
- SakshiEducationUpdates