New Syllabus: కొత్త విద్యాసంవత్సరంలో ఐబీ సిలబస్‌ ప్రారంభం..

ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలకు సందర్శించిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కళాశాలలోని సదుపాయాలను, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం, కొత్త విద్యాసంవత్సరంలో రాబోతున్న ఐబీ సిలబస్‌ గురించి వివరించారు..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరం నుంచి ప్రవేశ పెడుతున్న ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌ (ఐబీ) సిలబస్‌తో పాఠశాలల స్వరూపం సమూలంగా మారిపోనుందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ చెప్పారు. ఆయన శుక్రవారం గుంటూరు సాంబశివపేటలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు తరగతుల నిర్వహణ, నాడు–నేడు ద్వారా పురోగతిలో ఉన్న టాయిలెట్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం సైన్స్‌ ప్రాక్టికల్స్‌ ల్యాబ్‌ను తనిఖీ చేశారు.

Tenth Class: పకడ్బందీగా మార్కుల వెరిఫికేషన్‌

అధ్యాపకులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రపంచస్థాయిలో మేటి విద్యను అందించేందుకు తొలిసారిగా మన రాష్ట్రంలో ఐబీ సిలబస్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. అంతర్జాతీయస్థాయిలో ప్రఖ్యాతి చెందిన ఐబీ సిలబస్‌ ద్వారా విద్యార్థుల్లో మేధో వికాసం, వ్యక్తిగత అభివృద్ధి, భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవడంతో పాటు సామాజిక నైపుణ్యాల్ని అలవర్చుకోవడంలో దోహదం చేస్తుందని వివరించారు. ప్రాక్టికల్‌, థియరీతో పాటు విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు ఐబీ సిలబస్‌లో విభిన్నమైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు.

Collector Sikta Patnaik: విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి.. ప్రతీ విద్యార్థికి ఈ కార్డు

ఇంటర్మీడియెట్‌ సైన్స్‌ విద్యార్థులకు ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ప్రాక్టికల్స్‌ను సమర్థంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధ్యాపకులకు సూచించారు. విద్యాసంవత్సం ప్రారంభం నాటికి కళాశాలలను సుందరంగా తీర్చిదిద్దాలని అధికారుల్ని ఆదేశించారు. కళాశాల భవనానికి రంగులు వేయించి అహ్లాదకరంగా మార్చాలని సూచించారు. అనంతరం ఇదే కళాశాల పక్కన ఉన్న బాలికల వృత్తి విద్యా జూనియర్‌ కళాశాలకు వెళ్లిన, ప్రవీణ్‌ ప్రకాష్‌ విద్యార్థినులతో మాట్లాడారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని వారికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఈ రెండు కళాశాలల్లో వందలాది మంది విద్యార్థినులను చూసిన ప్రవీణ్‌ ప్రకాష్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.

Model United Nation: ఎస్‌ఆర్‌ వర్శిటీలో ‘మోడల్‌ యునైటెడ్‌ నేషన్‌’

అనంతరం టెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు గుంటూరు రూరల్‌ చౌడవరంలోని ఆర్వీఆర్‌ జేసీ ఇంజినీరింగ్‌ కళాశాలని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దీంతో పాటు టెన్త్‌ స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రం ఏర్పాటుపై పెదకాకానిలోని సెయింట్‌ జోసఫ్‌ హైస్కూల్‌ను పరిశీలించారు. ఆయన వెంట ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డి, ఆర్‌ఐవో జీకే జుబేర్‌, డీవీఈవో జె. పద్మ, డీఈవో పి.శైలజ, ప్రిన్సిపాల్స్‌ జి. సునీత, ఎన్‌. ఆనందబాబు ఉన్నారు.

#Tags