Tenth Class: పకడ్బందీగా మార్కుల వెరిఫికేషన్
Sakshi Education
కాళోజీ సెంటర్: పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించిన ఇంటర్నల్ మార్కుల వెరిఫికేషన్ పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ వాసంతి అధికారులకు సూచించారు.
ఇంటర్నల్ మార్కుల వెరిఫికేషన్ కోసం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 50 ప్రత్యేక టీంలకు చెందిన లీడర్లతో ఫిబ్రవరి 9న ఉర్సు తాళ్ల పద్మావతి పాఠశాలలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. డీఈఓ వాసంతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
చదవండి: Tenth Class: టెన్త్‌లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి
ఇంటర్నల్ మార్కుల వెరిఫికేషన్ ఎలా నిర్వహించాలో పలు సూచనలు చేశారు. జిల్లాలో 50 ప్రత్యేక వెరిఫికేషన్ టీంలను నియమించినట్లు తెలిపారు. ఒక్కో టీంనకు ఒక హెడ్‌మాస్టర్, లాంగ్వేజ్ టీచర్, నాన్ లాంగ్వేజ్ టీచర్ ఉంటారని వెల్లడించారు.
Published date : 10 Feb 2024 01:03PM