Tenth Class: టెన్త్‌లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి
మండలంలోని బుడితి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాన్ని, ఫొటో గ్యాలరీని ఆమె ఫిబ్రవరి 8న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఏడాది రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాల్లో మొదటి 7 స్థానాలకు గాను 6 స్థానాల్లో విశాఖపట్నం జోన్ విద్యార్థులే ఉన్నారని, ఈ ఏడాది అంతకు మించి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీని కోసం వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారు పరీక్షల్లో పాసయ్యేందుకు వీలుగా తర్ఫీదు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే 44 వేల మంది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశామన్నారు.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | ముఖ్యమైన ప్రశ్నలు | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది 28,982 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారని, వీరి కోసం 145 పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు ఆమె తెలిపారు. బుడితి ఉన్నత పాఠశాలలో జిల్లాలో ఎక్కడా లేని విధంగా 2014 నుంచి ఈ పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయునిగా పని చేస్తున్న జి.రవికుమార్ వి ద్యార్థులు వేసిన పలు రకాల పెయింటింగ్‌లను గ్యా లరీలా ఏర్పాటు చేసి దానికి ఓ గదిని కేటాయించ డం గొప్ప విషయమన్నారు.
ఆమెతో పాటు డీఈఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈఓ విజయకుమారి, డైట్ లెక్చరర్ జి.రవికుమార్, ఎంఈఓ భూలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు బి.మాధవరావు, ఉపాధ్యాయులు యోగేశ్వరరావు, చిత్రలేఖన ఉపాధ్యాయులు రవికుమార్ తదితరులున్నారు.