Government Scholarship Scheme: విద్యార్థుల ప్ర‌తిభ‌కు ఎన్ఎంఎంఎస్ ప‌థ‌కం

పాఠ‌శాల‌ల్లో ప్ర‌తిభ క‌లిగిన విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం ఎన్ఎంఎంఎస్ ప‌థ‌కాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప‌థ‌కంతో విద్యార్థుల‌కు ప్రోత్సాహం ల‌భిస్తుందని, ఇది కేవ‌లం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో 8వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కే ప‌రిమితమ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ ప‌రీక్ష కోసం ద‌ర‌ఖాస్తులు చేసుకునే విధి విధానాల గురించి ప్ర‌భుత్వం ఇచ్చిన స్ప‌ష్ట‌త‌..
Government scholarship scheme for 8th class students

సాక్షి ఎడ్యుకేష‌న్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పథకాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు.

ఎన్‌ఎంఎంఎస్‌ అర్హత పరీక్షలో ఎంపికై న వారికి 9వ తరగతి నుంచి ఇంటర్‌ పూర్తయ్యే వరకు ఏటా రూ.12వేలు వంతున నాలుగేళ్లకు మొత్తం రూ.48వేలు అందజేస్తారు. అయితే ఇంటర్‌ విద్యను ప్రభుత్వ పాఠశాలలోనే చదవాల్సి ఉంటుంది. వసతిగృహాల్లో ఉండి చదువుకునే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ ఇవ్వరు. డే స్కాలర్‌గా ఉన్న విద్యార్థులకు మాత్రే ఈ స్కాలర్‌షిప్‌ అందజేస్తారు.

IIITDM Convocation: ట్రిపుల్ఐటీడీఎం విద్యార్థుల‌కు 5వ స్నాత‌కోత్స‌వం

నేటితో ముగుస్తున్న గడువు

2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్‌ఎంఎంఎస్‌ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవడానికి శుక్రవారంతో గడువు ముగుస్తోంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. బీఎస్‌ఈ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో పాఠశాల డైస్‌ కోడ్‌ ద్వారా లాగిన్‌ అవ్వాలి. దరఖాస్తులో విద్యార్థి పూర్తి వివరాలను ఉపాధ్యాయుడి సమక్షంలో పొందుపర్చాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.50 పరీక్ష ఫీజు చెల్లించాలి.

రెట్టింపైన విద్యార్థుల సంఖ్య

గతేడాదితో పోలిస్తే ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2022–23 విద్యా సంవత్సరానికి ఈ ఏడాది ఫిబ్రవరి 5న జరిగిన ప్రవేశ పరీక్షలో ఉమ్మడి జిల్లా నుంచి 9,498 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ ఏడాది కూడా గతేడాదికి మించి దరఖాస్తులు వస్తాయని ఉపాధ్యాయులు భావిస్తున్నారు.

Degree Semester Funds: సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల నిధుల గురించి తెలిపిన వైస్ చాన్స‌ల‌ర్

డిసెంబర్‌ 3న అర్హత పరీక్ష

పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబర్‌ 3న అర్హత పరీక్ష నిర్వహిస్తారు. అదేరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాత పరీక్ష ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఎన్‌ఎంఎంఎస్‌ ప్రవేశ పరీక్షకు అర్హులు. ఆబ్జెక్టివ్‌ టైపు విధానంలో 180 మార్కులకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. 90 మార్కులకు రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్స్‌, మెంటల్‌ ఎబిలిటీ, జనరల్‌ ఇంగ్లిష్‌ ఉండగా, మరో 90 మార్కులకు 7,8వ తరగతులకు చెందిన గణితం, సైన్స్‌, సాంఘిక శాస్త్రం పాఠా్యాంశాలపై ప్రశ్నలుంటాయి. పరీక్ష రాసేందుకు మూడు గంటల సమయం కేటాయిస్తారు. జిల్లా ప్రాతిపదికగా స్కాలర్‌షిప్‌నకు విద్యార్థులను ఎంపిక చేస్తారు.

అర్హతలివీ..

ప్రస్తుతం ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, ఎయిడెడ్‌, మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలు, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.50 లక్షల లోపు ఉండాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఈ నెల 15 చివరి తేదీ కాగా, పరీక్ష రుసుం చెల్లించేందుకు ఈ నెల ఒకటో తేదీ తుది గడువు. ప్రధానోపాధ్యాయులు ప్రింటెడ్‌ నామినల్‌ రోల్స్‌, ఽధ్రువపత్రాలను సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో సమర్పించడానికి ఈ నెల19 చివరి తేదీ.

PG admissions: పీజీ ప్రవేశాలకు వెబ్‌ కౌన్సెలింగ్‌

సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకునే విధంగా ప్రధానోపాధ్యాయులు చూడాలి. ఎన్‌ఎంఎంఎస్‌ అర్హత పరీక్షను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించాలి. ఎన్‌ఎంఎంస్‌కు అధిక సంఖ్యలో విద్యార్థులు అర్హత సాధించే విధంగా సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి.
  
– జి.నాగమణి, ఆర్‌జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ
 

#Tags