KGBV Intermediate: కేజీబీవీల్లో ప్రవేశాలు.. ఇప్పుడు ఇంటర్‌ విద్య కూడా..

బాలికా విద్యార్థులకు కేజీబీవీ పాఠశాలల్లో ప్రవేశాలు పొందవచ్చని తెలిపింది ప్రభుత్వం. ప్రస్తుతం, ఈ పాఠశాలలో సదుపాయాలు, విధివిధానాలు మారాయి, పూర్తిగా అభివృద్ధి చేశారు. దరఖాస్తు వివరాలు..

వీరఘట్టం: కేజీబీవీలు.. బాలికలకు బంగారు భవిష్యత్తును అందిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి  వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో నెలకొల్పిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను గత టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. సౌకర్యాల కల్పనపై కినుకు వహించింది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కేజీబీవీలకు పూర్వవైభవం తీసుకొచ్చింది.

DA For TSRTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ 43.2%

నాడు–నేడు కింద సకల సదుపాయాలు కల్పించింది. ఇంటర్మీడియట్‌ విద్యను అందుబాటులోకి తెచ్చింది. ఆంగ్ల మాధ్యమ చదువులతో బాలికల భవితకు బంగారు బాటలు వేసేలా తీర్చిదిద్దింది. తాజాగా జిల్లాలోని 14 కేజీబీవీల్లో ఇంటర్‌ ఫస్టియర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Psychology Courses: సైకాలజీ కోర్సులతో ఉపాధి అవకాశాలు

కోర్సుల నిర్వహణ ఇలా..

కురుపాం, పార్వతీపురం, వీరఘట్టం కేజీబీవీల్లో ఎంపీసీ గ్రూపు, గరుగుబిల్లి, మక్కువ, సీతానగరం కేజీబీవీల్లో బైపీసీ, బలిజిపేట, భామిని, జియ్యమ్మవలస మండలాల్లో సీఈసీ, జి.ఎల్‌.పురంలో హెచ్‌ఈసీ, కొమరాడ, పాచిపెంట, సీతంపేట కేజీబీవీల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూ గ్రూపు, సాలూరు కేజీబీవీలో ఎం.ఎల్‌.టీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రతి గ్రూపులో 40 మందికి మాత్రమే అవకాశం. ఏప్రిల్‌ 11 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Placement Drive: గురుకులంలో ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌

బాలికలు సద్వినియోగం చేసుకోవాలి

కేజీబీవీలో టెన్త్‌ పాసైన బాలికలు బయటకు వెళ్లి ఇంటర్‌ విద్య చదువుకోలేక ఇబ్బందులు పడుతుండడంతో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు కేజీబీవీల్లో ఇంటర్‌ విద్యను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ అవకాశాన్ని బాలికలు సద్వినియోగం చేసుకోవాలి. మీ దగ్గరలో ఉన్న కేజీబీవీల్లోకి వెళ్లి మీ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

– కె.రోజారమణి, జీసీడీఓ, పార్వతీపురం మన్యం జిల్లా

Sunket High and Primary School: ‘మనఊరు – మనబడి’కి నిధుల్లేవ్‌

కేజీబీవీల్లో చదివిన వారికి మొదటి ప్రాధాన్యం

కేజీబీవీల్లో చదివిన బాలికలకు ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు తొలి ప్రాధాన్యమిస్తాం. మిగిలిన వారికి ప్రాధాన్యతా క్రమంలో సీట్లు కేటాయిస్తాం. జిల్లాలోని ఇంటర్‌ విద్యను ప్రవేశపెట్టిన 14 కేజీబీవీల్లో ఒక్కో గ్రూపు మాత్రమే ఏర్పాటు చేశాం. ఆ గ్రూపులో 40 మంది బాలికలకు ఈ ఏడాది టెన్త్‌ పాసైన వారికి అవకాశం ఇస్తాం. జిల్లాలో ఏ కేజీబీవీలో టెన్త్‌ పాసైనవారైనా సరే వారికి నచ్చిన కేజీబీవీల్లో ఇంటర్‌లో చేరవచ్చు.

– జి.పగడాలమ్మ, డీఈఓ, పార్వతీపురం మన్యం జిల్లా

Right to Vote: తొలిసారి ఓటు హక్కు వినియోగం.. యువత కలిగిస్తున్న అవగాహన

#Tags