Right to Vote: తొలిసారి ఓటు హక్కు వినియోగం... యువతకు ఒక బాధ్యత, ఒక అవకాశం
రాయచోటి: నేతల రాతలను మార్చడమే కాదు.. తమ బంగరు భవితను మార్చుకునేందుకు యువ ఓటర్లు ఎదురుచూస్తున్నారు. తొలిసారిగా ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. 2024 ఎన్నికల్లో అన్నమయ్య జిల్లాలో 34,592 మంది 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గతంతో పోల్చితే వీరి సంఖ్య భారీగా ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Free Coaching: నిరుద్యోగ అభ్యర్థులకు గ్రూప్స్, పోటీ పరీక్షలకు 3నెలల ఉచిత శిక్షణ
ఫలితమిచ్చిన ప్రచారం..
ఓటు హక్కు నమోదుపై కళాశాలలు, గ్రామాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇచ్చాయి. అర్హత కల్గిన యువతీ, యువకులు ఓటుహక్కును వినియోగించుకుని దేశ రాజకీయాలలో భాగస్వాములు కావాలని విస్తృత అవగాహన కార్యకమాలు నిర్వహించడంతో సంఖ్య పెరిగిందని అధికారులు చెబుతున్నారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో వీరి తీర్పు ఎటువైపు ఉండనుందనే ప్రశ్న పార్టీలను ‘తొలి’చేస్తోంది.
Free Coaching: స్టడీ సర్కిళ్లు సిద్ధం.. వీరు అర్హులు..
యువతను ఆకర్షించేందుకు.....
జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున యూత్ థీమ్‌తో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 6 పోలింగ్ కేంద్రాలను పూర్తిగా యువతతో నిర్వహించారు. ఇందులో రాజంపేటలో పురుషులు 3715, స్త్రీలు 3013 మొత్తం 6728, అలాగే కోడూరులో పురుషులు 2957, స్త్రీలు 2353 మొత్తం 5310, రాయచోటిలో పురుషులు 3333, స్త్రీలు 2617 మొత్తం 5950, తంబల్లపల్లిలో పురుషులు 2888, స్త్రీలు 2370 మొత్తం 5258, పీలేరులో పురుషులు 2872, స్త్రీలు 2344, ఇతరులు ఇద్దరు మొత్తం 5218, మదనపల్లిలో పురుషులు 3255, స్త్రీలు 2873, మొత్తం 6128 మంది ఓటర్లు ఉన్నట్లు సమాచారం.
UPSC Notification 2024: యూపీఎస్సీలో 28 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మంచి నేతను ఎన్నుకుంటాం....
ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి సంక్షేమంలో భాగస్వాములు అయ్యే నాయకులను ఎన్నుకుంటామని యువత స్పష్టం చేస్తున్నారు. కరువు ప్రాంతంగా ఉన్న జిల్లాలో సాగునీరు తాగునీటి వనరులను కల్పించడంతోపాటు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలంటే మంచి నాయకుడిని గెలిపించుకుంటామంటున్నారు.
ఓటు విలువ తెలియపరుస్తాం
తొలిసారిగా ఓటుహక్కును వినియోగించుకుంటున్న మేము ఓటు విలువను అభివృద్ధి కోసం వినియోగిస్తాం. మాతో పాటు మా పరిసర ప్రాంతాల్లో ఉన్న మరో పదిమందికి ఓటు విలువను తెలియపరుస్తాం.
–కె గురుసాయి చరణ్, బిటెక్ ద్వితీయ సంవత్సరం, రాయచోటి
సంతోషంగా ఉంది
తొలిసారిగా ఓటుహక్కును కలిగి ఓటు వేసుకునే అవకాశం వస్తుండటంతో సంతోషంగా ఉంది. యువత భవిష్యత్తుకు భరోసా కల్పించే నాయకుడికి ఓటు వేస్తాను. విద్య, ఉపాధి, పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసేవారికి అందరూ అండగా నిలవాలి.
–డి గౌతమి, బిటెక్ థర్డ్ ఇయర్, రాయచోటి
ఓటును అమ్ముకోం
ఓటు హక్కును ప్రలోభాలకు, ఇతర అవకాశాలకు అమ్ముకోం. విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశ్రామిక అభివద్ది సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వాల ఎంపికకు, సమస్యలపట్ల అవగాహనతో బాధ్యతాయుతంగా పోరాడి నేతలను ఎన్నుకునేలా ఓటుహక్కును వినియోగిస్తాం.
–సి కోయలత, బిటెక్ సెకండ్ ఇయర్, రాయచోటి
Intermediate Public Exams 2024: నేటి నుంచి ఇంటర్మీడియెట్ మూల్యాంకనం
గెలుపును మలుపుతిప్పుతాం
ఓటు హక్కును సంపాదించుకున్న తరువాత తొలి ఓటుతో గెలుపును మలుపు తిప్పుతాం. డబ్బుకు ఓటును అమ్ముకోకుండా మరో నలుగురికి అవగాహన కల్పిస్తాం. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవకు పాత్రుడయ్యే నిజమైన నాయకుడిని గెలిపించుకుంటాం.
–ఎస్‌కె దినేష్ రెడ్డి, బిటెక్ (థర్డ్ ఇయర్), రాయచోటి
Scout and Guides: విద్యార్థుల క్రమశిక్షణకు స్కౌట్ అండ్ గైడ్స్..