Intermediate Public Exams 2024: నేటి నుంచి ఇంటర్మీడియెట్ మూల్యాంకనం
Sakshi Education
Intermediate Public Exams 2024: నేటి నుంచి ఇంటర్మీడియెట్ మూల్యాంకనం
అనంతపురం : ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనంలో భాగంగా ఈనెల 26న కెమిస్ట్రీ, హిస్టరీ, 28న బాటనీ, జువాలజీ, కామర్స్ జవాబుపత్రాలను నేటి (సోమవారం) నుంచే ప్రారంభమవుతాయని క్యాంపు ఆఫీసర్, జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి ఎం.వెంకటరమణ నాయక్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయా సబ్జెక్టులకు మూల్యాంకన ఉత్తర్వులు పొందిన చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు సోమవారం ఉదయం అనంతపురంలోని కొత్తూరు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలోని క్యాంపునకు చేరుకోవాలని కోరారు
Published date : 25 Mar 2024 03:25PM