Sunket High and Primary School: ‘మనఊరు – మనబడి’కి నిధుల్లేవ్
మూత్రశాలలను ఉపాధి హా మీ నిధులతో, ఇతర పనులను ‘మన ఊరు–మన బడి’ నిధులతో నిర్మించాలని నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు కేవలం రూ.5 లక్షల బిల్లులు మాత్ర మే చెల్లించారు. మిగిలిన చెల్లింపులకు నిధులు లేకపోవడంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఏడాదిన్నర కాలంగా చెల్లింపులు లేకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఇలా జిల్లాలోని పాఠశాలల్లో ‘మన ఊరు– మన బడి’ కింద చేపట్టిన పనులు నిలిచిపోయాయి.
‘మనఊరు–మనబడి’ కార్యక్రమానికి నిధుల కొరత ఏర్పడింది. 2022లో తొలి విడతలో ఎంపిక చేసిన పాఠశాలల్లో డైనింగ్ హాల్, కిచెన్ షెడ్‌లు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, సంప్‌హౌజ్‌లను నిర్మించాలని ప్రతిపాదించారు. జిల్లాలో 1,234 పాఠశాలలుండగా అందులో 407 స్కూళ్లను ఎంపిక చేశారు. 2022–23 విద్యా సంవత్సరానికి చేపట్టిన పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో రెండో విడ త పనులను గుర్తించడానికి అవకాశం లేకుండా పో యింది. ఈ కార్యక్రమం కింద ఏ పాఠశాలకైనా రూ.30 లక్షలకు మించి నిధులు మంజూరైతే ఆ పనులను టెండర్ ద్వారా కాంట్రాక్టర్‌కు అప్పగించాలని నిర్ణయించారు.
చదవండి: Encouraging Students: చదువుతో ఉన్నత స్థాయికి చేరాలి..
రూ.30 లక్షలకు తక్కువ నిధులు ఉంటే నామినేషన్ పద్ధతిలో చేపట్టాలని గత ప్రభుత్వం తీర్మానించింది. దాదాపు అన్ని పాఠశాలల్లో నామినేషన్ పద్ధతిలోనే పనులు చేపట్టేలా అంచనాలను తయారు చేశారు. అయితే రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు నిధులు మంజూరైన పాఠశాలల్లోనే పనులు ప్రారంభమయ్యాయి. రూ.30 లక్షలు అంతకు మించి నిధులు కేటాయించిన చోట పనులు ప్రారంభంకాలేదు. అయితే ప నులు మొదలైన చోట కూడా అర్ధంతంగా నిలిచి పోయాయి. బిల్లులు రాకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి నిధులు కేటాయించి పనులు పూర్తిచేయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
నిధులు లేక బిల్లుల నిలిపివేత..
గత అక్టోబర్‌లోనే బిల్లుల చెల్లింపులు నిలిచిపోయా యి. ప్రభుత్వం నిధులను విడుదల చేస్తే చెల్లింపులు జరిపి పనులను పూర్తి చేయిస్తాం.
– సాయన్న, ఏఈ, మన ఊరు మన బడి పనుల ఇన్‌చార్జి