Encouraging Students: చదువుతో ఉన్నత స్థాయికి చేరాలి..
భీమడోలు: విద్యతోనే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని సినీ నటుడు సుమన్ అన్నారు. గుండుగొలనులో విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సామాజిక సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాను ఉన్నత స్థితికి చేరడానికి అమ్మ చేసిన సేవే అని గుర్తుకు తెచ్చుకున్నారు. తన తల్లి కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ వచ్చిన జీతాన్ని పేద విద్యార్థుల అవసరాలకు వినియోగించే వారని, తద్వారా కొన్ని సందర్భాల్లో మధ్య తరగతి కుటుంబం కావడంతో చాలా ఇబ్బందులు పడేవారమన్నారు.
Free Admissions: ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రవేశ దరఖాస్తులకు చివరి తేదీ..!
పేదలకు సేవలందించే స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే కార్యక్రమాలకు తాను హాజరుకావడానికి ఆసక్తి చూపుతానన్నారు. తాను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తర్వాత మిత్రుడు భానుచందర్ ద్వారా సినీ ఆరంగేట్రం చేశానని, ఇప్పటివరకు పది భాషల్లో 800 సినిమాల్లో నటించానని, వాటిలో 100 చిత్రాలు తెలుగులోనే నటించి తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచానన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి విద్య అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
9 ఏళ్లుగా దివ్యాంగులకు సేవలందిస్తున్న నిర్వాహకులను అభినందించారు. తొలుత శ్రీ విద్యాలయ విద్యా సంస్థ చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు, మార్షల్ ఆర్ట్స్ ఆకట్టుకున్నాయి. అనంతరం నేరోలాక్ ప్రతినిధుల ఆర్థిక సాయంతో 60 మంది దివ్యాంగులకు బియ్యం, పండ్లను సుమన్ చేతుల మీదుగా అందించారు. శ్రీ విద్యాలయ విద్యార్థులు సమకూర్చిన రూ.3 లక్షల చెక్కును సుమన్ చేతుల మీదుగా నిర్వాహకులకు అందించారు.
TREI-RB: గురుకుల బోర్డుకు కొత్త సారథులు!
తొలుత సుమన్‌ను అర్చకులు లంకా శివకుమార్, శ్రీనివాస్ వేదమంత్రోచ్చరణ మధ్య సన్మానించారు. అనంతరం, గ్రామపెద్దలు, నిర్వాహకులు ఆయనకు మొమెంటో, శాలువాను కప్పి ఘనంగా సత్కరించారు. వెండితెర నటులు అల్లం గోపాలరావు, అల్లం అనిల్, ట్రస్ట్ అధ్యక్షుడు దాట్ల సీతారామరాజు, అధ్యక్షుడు గేదెల శ్రీనివాసరావు, సినీ డైరెక్టర్ తోట రవి, పేరిచర్ల శ్యామలరాజు, చప్పిడి సత్యనారాయణ పాల్గొన్నారు.
Intermediate Public Exams 2024: నేటి నుంచి ఇంటర్మీడియెట్ మూల్యాంకనం