IB Team Inspection: ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఐబీ బృందం

పాఠశాలలోని విద్యావిధానాలను పరిశీలించేందుకు ఐబీ బృందం సందర్శించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులతో అక్కడి అధికారులతో సమావేశమై సభ్యులతో చర్చించారు..

 

కశింకోట: మండలంలోని తేగాడలో ఉన్న ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో విద్యా విధానాన్ని ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌ (ఐబీ) బృందం మంగళవారం పర్యటించి అధ్యయనం చేసింది. ఐబీ సీనియర్‌ కరిక్యులం డిజైన్‌ మేనేజర్‌ ఆల్డో, ఐబీ అసోసియేట్‌ మేనేజర్‌ మైఖేల్‌, రాష్ట్ర ఎన్‌సీఈఆర్‌టీ ప్రొఫెసర్‌ ఆచార్య కేశిరాజు శ్రీనివాస్‌, జిల్లా విద్యా శాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ, జిల్లా ఉప విద్యాశాఖ అధికారి అప్పారావు ఈ బృందంలో ఉన్నారు.

Tenth Board Exams 2024: పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై సాక్షితో డీఈఓ వరలక్ష్మి ముఖాముఖి..

ఈ సందర్భంగా బృందం పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశమై అక్కడ అమలు చేస్తున్న విద్యా విధానం, బోధనా పద్ధతులు, ఉపాధ్యాయ శిక్షణ, బోధనలో అనుభవాలు తదితర అంశాలపై బృందం సభ్యులు చర్చించారు. ఈ సందర్భంగా ఆచార్య శ్రీనివాస్‌ రాష్ట్రంలో ఐబీ విద్యా విధానం అమలుతో కలిగే ప్రయోజనాలపై కూలంకషంగా బృందం సభ్యులతో చర్చించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఐ.మార్తాండ తిలకం, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Free Group 1 Coaching: ఉచిత కోచింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

#Tags