Water Break: పాఠశాలల్లో నీటి విరామం అమలు..

విద్యార్థుల ఆరోగ్యం, మారుతున్న వాతావరం వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు ఈ విధానాన్ని చేపట్టింది. విద్యార్థుల ఆరోగ్యం అన్నింటికన్నా ముఖ్యం అని చర్యలు చేపట్టారు..

భువనేశ్వర్‌: పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న చర్యకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో నీటి గంట (వాటర్‌ బెల్‌) విధానాన్ని ప్రవేశపెట్టింది. తరగతి సమయాల్లో విద్యార్థుల గొంతు ఎండిపోకుండా ఉండేలా ఈ చర్యకు సంకల్పించడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో దీన్ని తప్పనిసరి చేయాలని పాఠశాల,  సామూహిక విద్యా శాఖ మండల విద్యాధికారులు (బీఈఓ), జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈఓ)లకు లేఖ రాసింది. విద్యార్థులను నీరు తాగడానికి ప్రేరేపించడం కోసం నీటి గంట విధానం అనుసరిస్తారు.

Summer Holidays: ఇంటర్‌ విద్యార్థులకు వేసవి సెలవుల ప్రకటన.. పునఃప్రారంభం ఎప్పడు..?

తరగతి వేళల్లో వరుసగా ఉదయం 8.30, 10, 11 గంటలకు నీటి గంట (వాటరు బెల్‌) 3 సార్లు మోగించాలని తాజా ఉత్తర్వుల పేర్కొన్నాయి. విద్యార్థులు సకాలంలో నీరు తాగేలా ఉపాధ్యాయులు బాధ్యత వహిస్తారు. పాఠశాలకు వచ్చిపోవడంలో విద్యార్థులు గొడుగులు, నెత్తిన టోపీలు ధరించడంపై విద్యార్థులను చైతన్యపరచాలని పాఠశాల వర్గాలకు తెలిపారు. ఈ చర్యతో గొంతు ఎండిపోకుండా వడ దెబ్బ సంబంధిత విపత్తు, వ్యాధులను నివారించడం సాధ్యం అవుతుందని సామూహిక విద్యా శాఖ వివరించింది. వడగాడ్పుల పరిస్థితుల కారణంగా వడదెబ్బ నివారణకు ఎండ సమయంలో నీడ పాటున ఉండేలా స్వీయ ప్రయత్నం చేయాలని వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది.

Job Vacancies In ECIL: ఈసీఐఎల్‌లో గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌, చివరి తేదీ ఎప్పుడంటే..

#Tags