Skip to main content

Summer Holidays: ఇంటర్‌ విద్యార్థులకు వేసవి సెలవుల ప్రకటన.. పునఃప్రారంభం ఎప్పడు..?

ఇటీవలె ఇంటర్‌ విద్యార్థులు బోర్డు పరీక్షలు ముగిసాయి. వారి పరీక్షల మూల్యాంకన పనులు కూడా అతి వేగంగా కొనసాగుతున్నాయి. అయితే, విద్యార్థులకు ఇంటర్‌ బోర్డు వేసవి సెలవులను ప్రకటించి, గడువును వెల్లడించింది..
Evaluation of exams in progress  DVEO Manjula Veena announcing summer vacation  DEO Manjula Veena announces summer holidays for intermediate students

 

పార్వతీపురంటౌన్‌: ఇంటర్మీడియట్‌ కళాశాలలకు ప్రభుతం వేసవి సెలవులు ప్రకటించిందని డీవీఈఓ మంజులా వీణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని, జూన్‌ 1 నుంచి తిరిగి ఇంటర్మీడియట్‌ కాలేజీలు పునఃప్రారంభం కానున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు ఆదేశించినట్లు పేర్కొన్నారు.

Balasadanam Students: బాలసదనం విద్యార్థినులతో కలెక్టర్‌..!

సెలవుల్లో ఎలాంటి క్లాసులు నిర్వహించరాదని, అలాగే షెడ్యూల్‌ విడుదల కాకపోయినా ప్రవేశాలు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Diploma Courses: ఉర్దూ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సులు.. ఇదే దరఖాస్తులకు చివరి తేదీ..!

Published date : 05 Apr 2024 11:28AM

Photo Stories