Skip to main content

Balasadanam Students: బాలసదనం విద్యార్థినులతో కలెక్టర్‌..!

విద్యార్థులకు అందుతున్న చదువు, సదుపాయాలను పరిశీలించేందుకు బాలికల ఆశ్రమాన్ని సందర్శించారు కలెక్టర్‌ వియసుననీత. అక్కడ విద్యార్థులతో ప్రోత్సాహిస్తూ మాట్లాడారు..
Collector Vijaya Sunitha visits Balasadanam Girls School    Distribution of material kits by ICDS organization to girls at ashram

పాడేరు: బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న బాలికలంతా బాగా చదివి, ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్‌ ఎం.విజయసునీత ఆకాంక్షించారు. స్థానిక ఐసీడీఎస్‌ బాలసదనాన్ని గురువారం ఆమె సందర్శించారు. విద్యార్థినులతో ఆమె మాట్లాడారు. చాలా సమయం వారితో గడిపారు. ఆటపాటలతో బాలికలు సందడి చేశారు. ఐసీడీఎస్‌ సంస్థ అందుబాటులో తెచ్చిన పలు మెటీరియల్‌ కిట్లను బాలికలకు కలెక్టర్‌ పంపిణీ చేశారు.

Diploma Courses: ఉర్దూ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సులు.. ఇదే దరఖాస్తులకు చివరి తేదీ..!

రెండు వాషింగ్‌ మెషీన్లు, ఫ్రిజ్‌, స్మార్ట్‌ టీవీలను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మావతి,ఐసీడీఎస్‌ పీడీ సూర్యలక్ష్మి,సూపర్‌వైజర్‌ ఉర్మిల పాల్గొన్నారు. ఇదిలావుండగా జాయింట్‌ కలెక్టర్‌ భావన వశిష్ట, పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్‌ బాల సదనాన్ని సందర్శించారు. ట్రంక్‌ పెట్టెలు, ఇతర సామగ్రిని బాలికలకు పంపిణీ చేశారు.

CBSE New Syllabus: సీబీఎస్‌ఈ కొత్త సిలబస్‌..ఈ ఏడాది నుంచే అమల్లోకి

Published date : 05 Apr 2024 11:34AM

Photo Stories