Children Education: బడిఈడు పిల్లలను గుర్తించాలి..
చిన్నతనంలోనే చదువుకు దూరమైన వారిని గుర్తించాలన్నారు జిల్లా అదనపు ప్రాజెక్టు సమస్వయకర్త విజయలక్ష్మి. ఈ వివరాలను సేకరించి ప్రకటించిన తేదీలోగా నమోదు చేయాలని ఆదేశించారు.
గుంటూరు: జిల్లాలో చదువుకు దూరమైన, బడిఈడు పిల్లలను గుర్తించాలని సమగ్రశిక్ష గుంటూరు జిల్లా అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త జి. విజయలక్ష్మి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆరేళ్ల నుంచి 14 ఏళ్ల లోపు వయసు కలిగి, బడి మధ్యలో మానేసిన విద్యార్థులతో పాటు ఐదేళ్లకు పైబడి బడిఈడు కలిగిన బాలల వివరాలపై ఈ నెల 10వ తేదీలోపు క్షేత్రస్థాయిలో వివరాలు నమోదు చేయాలని సీఆర్పీలకు తెలిపారు.
Education Officers: చనిపోయినా పది మూల్యాంకనానికి రావాల్సిందే...!
మండలాల వారీగా ఎంఈవోలు ఈ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చి, సీఆర్పీలతో పకడ్బందీగా సర్వే నిర్వహించి, వివరాలను గూగుల్ ఫాంలో పూర్తిచేయించాలని ఇదే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయాలని పేర్కొన్నారు.
Teachers at Tenth Evaluation: మూల్యాంకనంలో గైర్హాజురైన వారికి శాఖాపరమైన చర్యలు..
#Tags