School Students Safety Guidelines : పాఠశాల భద్రత, రక్షణపై మార్గదర్శకాలను అమలు చేయాలి..

న్యూఢిల్లీ: పాఠశాలల్లో పిల్లల భద్రత, రక్షణ కోసం “పాఠశాల భద్రత, రక్షణపై మార్గదర్శకాలను’ తక్షణమే అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర విద్యా శాఖ కోరింది. పాఠశాల భద్రత, రక్షణ–2021 మార్గదర్శకాల అమలు తీరును తెలియచేయాలని కూడా కోరింది. ఈ మేరకు రాష్ట్రాలు, యూటీలకు విద్యాశాఖ లేఖ రాసింది. పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలలో పిల్లల భద్రత, రక్షణకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపింది.

Jobs In Medical College: మెడికల్‌ కాలేజీలో వివిధ పోస్టుల భర్తీ.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో నియామకం

పాఠశాల భద్రత, రక్షణపై కేంద్రం 2021లో విడుదల చేసిన మార్గదర్శకాలలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల భద్రత, రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల వివరాలున్నాయి. ఫస్ట్‌ ఎయిడ్‌ వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలను కల్పించ‌డం వంటివి ఇందులో కొన్ని. అదేవిధంగా, పిల్లల ఫిర్యాదులపై సరైన చర్యలు తీసుకోకపోవడం, వారిని బెదిరింపులకు గురిచేయడం, వారిపట్ల వివక్ష చూపడం వంటివి రుజువైతే జరిమానా విధించడంతోపాటు అవసరమైతే గుర్తింపు రద్దు చేస్తామంటూ కేంద్రం గతంలోనే పాఠశాలలను హెచ్చరించింది.

Engineering Counselling: ఇంజనీరింగ్‌ స్లైడింగ్‌ సీట్ల కేటాయింపు

#Tags