Formative Assessment: విద్యార్థుల‌కు ఫార్మేటివ్-2 ప‌రీక్ష‌లు.. కానీ ఈ ఒక్క పేప‌రు మాత్రం!

పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు ఫార్మేటివ్ ప‌రీక్ష‌ల నిర్వాహం ఏ పొర‌పాటు లేకుండా జ‌ర‌పాలని అన్ని రాకాల భ‌ద్ర‌త‌ల‌ను తీసుకుంటున్నారు. ప‌రీక్ష‌కు సంబంధించిన టైం టేబుల్ ను విడుద‌ల చేశారు. దీంతోపాటు, ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌డాకి భ‌ద్ర‌త‌ల‌ను కూడా తెలిపారు. పూర్తి వివ‌రాల‌ను ప‌రిశీలించండి..
Students of Parvatipuram school

పొరపాట్లకు తావు లేకుండా..

ఫార్మేటివ్‌–1 పరీక్ష నిర్వహించిన మాదిరిగానే ఫార్మేటివ్‌–2 పరీక్షను సక్రమంగా నిర్వహించాలి. పాఠశాలల హెచ్‌ఎంలు ఎటువంటి పొరపాట్లకు తావులేని విధంగా నిర్వహించాలి. ఏ విధమైన పొరపాట్లు తలెత్తినా వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఫార్మేటివ్‌–2 పరీక్షలు పాత విధానంలోనే నిర్వహిస్తున్నాం. ఈ విషయమై ప్రధానోపాధ్యాయులకు ఇప్పటికే సమాచారం అందించాం. పేపరు డౌన్‌లోడ్‌ చేసుకుని నిర్వహించాల్సిన విషయంపై కూడా అవగాహన కల్పించాల్సిందిగా ఎంఈఓలకు సూచించాం.

– ఎన్‌. ప్రేమ్‌ కుమార్‌, జిల్లా విద్యాశాఖాధికారి, పార్వతీపురం మన్యం

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను వెలికి తీసేందుకు నిర్వహించే ఫార్మేటివ్‌–2 పరీక్షలు అక్టోబర్‌ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు గత నెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన విషయం విదితమే. వచ్చే నెల మూడవ తేదీన ప్రారంభమయ్యే పరీక్షలను 6వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్యాల పరిధిలో ఉన్న అన్ని పాఠశాలల విద్యార్థులు రాయాల్సి ఉంటుంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర విద్యా పరిశోధన మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) రూపొందించిన ఉమ్మడి ప్రశ్నపత్రం ద్వారానే పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ విడుదల చేశారు. ఫార్మేటివ్‌–1 పరీక్షను క్లాస్‌రూమ్‌ బేస్డ్‌ విధానంలో ఓఎంఆర్‌ ద్వారా నిర్వహించగా, ఫార్మేటివ్‌ –2 పరీక్షలు పాత విధానంలో నిర్వహించనున్నారు.

జిల్లాలో పరిస్థితి ఇదీ

పార్వతీపురం మన్యం జిల్లాలో 1,694 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలున్నాయి. 1–5 తరగతుల వరకు ప్రభుత్వ యాజమాన్యంలో మంది, ప్రైవేట్‌ యాజమాన్యంలో 46,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 6–10 తరగతుల వరకు ప్రభుత్వ యా జమాన్యంలో 72,000 మంది, ప్రైవేట్‌ యాజమాన్యంలో 37,486 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు.

పరీక్షల షెడ్యూల్‌లో ముఖ్యాంశాలు

ఎఫ్‌ఎ–2 పరీక్షలు అక్టోబర్‌ 3,4 తేదీల్లో 1–5 తరగతి వరకు విద్యార్థులకు ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా నిర్వహిస్తారు. 3న తెలుగు, గణితం, 4న ఈవీఎస్‌, ఇంగ్లిష్‌ పరీక్షలు నిర్వహిస్తారు. 5న 3–5 తరగతుల విద్యార్థులకు ఓఎస్‌ఎస్సీ పరీక్ష ఉదయం నిర్వహిస్తారు. 6,7,8 తరగతుల విద్యార్థులకు 3న తెలుగు, గణితం, 4న హిందీ, జనరల్‌ సైన్స్‌, 5న సోషల్‌, ఇంగ్లిష్‌, 6న ఓఎస్‌ఎస్సీ–1, ఓఎస్‌ఎస్సీ–2 పరీక్షలు నిర్వహిస్తారు. 9,10 తరగతులకు 3న తెలుగు, గణితం, 4న హిందీ, జనరల్‌ సైనన్స్‌, 5న సోషల్‌, ఇంగ్లిష్‌, 6న ఓఎస్‌ ఎస్సీ–1, ఓఎస్‌ఎస్సీ–2 పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి 10.30, మధ్యాహ్నం 1.20 నుంచి 2.20 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. 3,4,5 తరగతులకు ఇంగ్లిష్‌ పార్ట్‌–బి మధ్యాహ్నం 2.30 నుంచి 2.50 గంటల వరకు నిర్వహించనున్నారు. 6–8 తరగతులకు మధ్యాహ్నం 1.10 నుంచి 2.10 గంటల వరకు ఒక పరీక్ష, 2.20 నుంచి 3.20 గంటల వరకు ఒక పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ పార్ట్‌–బి మాత్రం 3.30 గంటల నుంచి 3.50 గంటల వరకు నిర్వహిస్తారు. 9,10 తరగతులకు ఉదయం 9.30 నుంచి 10.15, రెండో పరీక్ష ఉదయం 10.30 నుంచి 11.15 గంటల వరకు నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ పార్ట్‌–బి ఉదయం 11.30 నుంచి 11.50 గంటల వరకు నిర్వహించనున్నారు. ప్రశ్నపత్రాన్ని బ్లాక్‌ బోర్డుపై ఉపాధ్యాయులు రాయగా, విద్యార్థులు నమోదు చేసుకుని, సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఎఫ్‌ఎ–2 పరీక్షకు ప్రింటెడ్‌ పేపర్లను సరఫరా చేయడం లేదు. అన్ని మేనేజ్‌మెంట్ల ప్రధానోపాధ్యాయులకు పరీక్ష పేపర్లను మెయిల్‌లో పంపిస్తారు. ఆ పేపర్లను సంబంధిత ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్‌ చేసుకుని, పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుంది.

ఈ ఒక్క పరీక్ష మాత్రమే

ఫార్మేటివ్‌–2 ప్రశ్నపత్రాలను సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ–మెయిల్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఒక్క పరీక్ష మాత్రమే ఈ విధంగా నిర్వహించేలా ఎస్‌సీఈఆర్టీ నుంచి ఆదేశాలు వచ్చాయి. మిగిలిన అన్ని పరీక్షలను ప్రింటెడ్‌ పేపర్ల సహాయంతో నిర్వహించనున్నారు.

– సామల సింహాచలం, ఎంఈఓ సంఘం
అధ్యక్షుడు, పార్వతీపురం మన్యం జిల్లా

 

#Tags