Education System: పాఠశాలల రూపురేకల మార్పులపై ప్రశంసలు.. ఉపాధ్యాయుల బదిలీలు ఇలా!

క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రాలరెడ్డి ఏపీ జరుతున్న మార్పుల గురించి, అక్కడి ఉపాధ్యాయుల బదిలీల గురించి వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అమలవుతున్న విద్య విధానాలపై స్పందిస్తూ ప్రశంసలు తెలిపారు..

 

కడప: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా విధానానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఐటీఐ సమీపంలోని తన క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, అపుస్మా స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పీవీ రమణారెడ్డి, జిల్లా వ్యవస్థాపకులు ఇలియాస్‌ రెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. 57 నెలల వైఎస్సార్‌సీపీ పాలనలో నాడు–నేడు ద్వారా రూ.74వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చివేశారన్నారు.

Engineering Colleges: 9 ఏళ్లలో 75 కాలేజీలు మూత!.. ఏటా తగ్గుతున్న కాలేజీలు సంఖ్య ఇలా..

కార్పొరేట్‌ పాఠశాలలను తలదన్నేలా మౌళిక వసతులు కల్పించారన్నారు. పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, యూనిఫారం, షూ, బెల్ట్‌ వంటివి అందిస్తామని తెలిపారు. ఉపాధ్యాయులకు ఏపీజీఎల్‌ఐ, పీఎఫ్‌ రుణాలను 95 శాతం క్లియర్‌ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 59 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టామన్నారు. 98 డీఎస్సీకి సంబంధించి 4 వేల మందికి పోస్టింగులు ఇచ్చారన్నారు. దేశంలో మరే ముఖ్యమంత్రి చేయని విధంగా విద్యాకానుక, వసతి దీవెన, విదేశీ విద్య పథకాలను అమలు చేస్తున్నారన్నారు. టీడీపీ పాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఒకసారి గుర్తెరిగి వైఎస్‌ జగన్‌కు అండగా నిలవాలని కోరారు.

Job Offer with Course: ముగిసిన ప్రవేశ పరీక్షల దరఖాస్తులు.. ఈ కోర్సులతో ఉద్యోగాలు సాధిస్తే..!

మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ హెడ్మాస్టర్లపై ప్రభుత్వం ఎలాంటి భారం మోపలేదని, వారైతే పనులను నిజాయితీగా పర్యవేక్షిస్తారనే వారికి అప్పగించడం జరిగిందన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా రూ.3వేల వేతనం పెంచారన్నారు. ఆరోగ్య భీమా పథకంలో సంరక్షణ కల్పించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నీతిఅయోగ్‌ ప్రశంసించిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలలు నడుపుతున్న యాజమాన్యాల సమస్యల పట్ల కూడా ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తోందని, ఉద్యోగ, ఉపాధ్యాయులు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు తెలపాలని కోరారు.

APPSC Group 2 Prelims Results 2024 Released : బ్రేకింగ్ న్యూస్‌.. గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌ల‌.. మెయిన్స్ ప‌రీక్ష తేదీ ఇదే..

#Tags