AP Education Scheme: విద్యార్థులకు విద్యాదీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల..

పేద విద్యార్థులు ఉన్నత చదువుతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఏపీ ప్రభుత్వం విద్యాదీవెన పథకం అమలు చేసింది. ఈ పథకాన్ని సీఎం జగన్‌ శుక్రవారం రోజు దీనిని ప్రారంభించారు..

అనంతపురం అర్బన్‌: విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్‌ గౌతమి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ అన్నారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కృష్ణాజిల్లా పామర్రు వేదికగా జగనన్న విద్యాదీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని కంప్యూటర్‌ బటన్‌ నొక్కి తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు.

 

Teachers: ఉపాధ్యాయులకు సూచన..

అనంతపురం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వాసంతి సాహిత్య, వక్ఫ్‌ బోర్డు జిల్లా చైర్మన్‌ కాగజ్‌గర్‌ రిజ్వాన్‌, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ మేడా రామలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ ఎల్‌ఎం ఉమాదేవి పాల్గొన్నారు.

 

Education: విద్యతో బాల్య వివాహాలకు చెక్‌

కలెక్టర్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ సీఎం జగన్‌ విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన పథకం గొప్ప వరమన్నారు. ఈ పథకం కింద 2023 అక్టోబరు – డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 40,006 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తం రూ.29.08 కోట్లను 36,260 మంది తల్లుల ఖాతాల్లోకి జమ చేశారన్నారు.

IB Syllabus in AP Govt Schools: ప్రభుత్వ పాఠశాలల్లో బోధన భేష్‌.. ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్‌..

పేదరికమే ప్రామాణికంగా పథకాలు

కుల, మతలాలకు అతీతంగా పేదరికం ప్రామాణికంగా పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని కలెక్టర్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ పేర్కొన్నారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద ప్రభుత్వం 2023 అక్టోబరు–డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి 7,104 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.4.69 కోట్లు, 1,635 మంది ఎస్టీ విద్యార్థులకు రూ.1.15 కోట్లు, 19,968 మంది బీసీ విద్యార్థులకు రూ.13.94 కోట్లు, 4,987 మంది ఈబీసీ విద్యార్థులకు రూ.4.69 కోట్లు, 3,907 మంది ముస్లిం మైనారిటీ విద్యార్థులకు రూ.2.70 కోట్లు, 2,298 మంది కాపు విద్యార్థులకు రూ.1.84 కోట్లు, 107 మంది క్రిస్టియన్‌ మైనార్టీ విద్యార్థులకు రూ.7 లక్షలు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదలైందన్నారు.

TS Inter Public Exams Alert 2024 : ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం.. ఈ నిబంధన సడలింపు.. ఈ ఏడాది కొత్తగా..

ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అనంతరం విద్యాదీవెన మెగా చెక్కును ఆవిష్కరించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ మధుసూదన్‌రావు, డీటీడబ్ల్యూఓ రామాంజనేయులు, బీసీ సంక్షేమాశాఖ డీడీ కుష్బూకొఠారి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ ఏడీ రసూల్‌, మైనారిటీ సంక్షేమశాఖ ఏడీ రామసుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tribal DSC: ప్రత్యేక ట్రైబల్‌ డీఎస్సీ ప్రకటించాలని వినతి

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు

మా లాంటి పేద విద్యార్థులకు ఉన్నత విద్య భారం... దూరం కాకుండా విద్యాదీవెన ద్వారా తోడ్పాటు అందిస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ఐఐటీ, ఇంజినీరింగ్‌, డిగ్రీ, మెడిసిన్‌ చేస్తున్న పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కల్పిస్తుండడం గొప్ప విషయం. మా కుటుంబానికి రైతు భరోసా, వైఎస్సార్‌ పింఛను కానుక, మరికొన్ని పథకాల ద్వారా లబ్ధి చేకూరుతోంది.

– ఎం.నందిని, బీఎస్సీ సెకండియర్‌, ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల, అనంతపురం

Job Mela: 6న జాబ్‌మేళా.. వివిధ ప్రముఖ కంపెనీల ద్వారా 517 ఉద్యోగాలు..

ఉన్నత విద్యకు అండ

పేదలు ఉన్నత విద్య అభ్యసించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వల్ల మాలాంటి పేద విద్యార్థుల చదువుకు భరోసా లభించింది. క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజును అదే త్రైమాసికంలో చెల్లిస్తున్నారు. మా కుటుంబంలో నాకు విద్యాదీవెన, మా తమ్మునికి అమ్మ ఒడి ద్వారా లబ్ధి చేకూరింది. పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న సీఎంకు కృతజ్ఞతలు.

– ఎన్‌.సరిత, బీఏ సెకండియర్‌, ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల, అనంతపురం

Osmania University: ఓయూకు పూర్వ విద్యార్థి భారీ విరాళం.. ఏకంగా రూ.5 కోట్లు!!

#Tags