Education Schemes: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య ఆరోగ్యానందిస్తున్న ప్రభుత్వ పథకాలు
ప్రభుత్వం ఎనలేని కృషి
గిరిజన పిల్లల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోంది. నాడు–నేడులో పాఠశాలల రూపురేఖలు మార్చివేసింది. రుచికరమైన భోజనంతో పాటు విద్యార్థుల ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. గతంతో పోలిస్తే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది.
–తెల్లం బాలరాజు, ఎమ్మెల్యే, పోలవరం
నాణ్యమైన విద్య అందించేలా..
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేస్తున్నాం. వారి ఆరోగ్యాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. మారుమూల పాఠశాలల్లో సైతం డిజిటల్ విద్యాబోధన జరుగుతుంది. మెనూ ప్రకారం పోషకాహారం అందిస్తున్నాం.
– పీవీఎస్ నాయుడు, ఇన్‌చార్జి డీడీ, కేఆర్ పురం
బుట్టాయగూడెం: రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. మారుమూల కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న అడవి బిడ్డలకు అండగా నిలుస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా వారికి అందేలా చూడటంతో పాటు గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంది. మనబడి నాడు–నేడు కార్యక్రమంలో ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన పాఠశాలలను కార్పొరేట్ వసతులతో తీర్చిదిద్దింది.
Quiz of The Day (March 19, 2024): థర్మల్ రియాక్టర్‌లో శక్తిని విడుదల చేసే ముఖ్యమైన మూల పదార్థం?
అలాగే విద్యార్థులకు జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, నాణ్యమైన ఆహారం, డిజిటల్ తరగతుల బోధన వంటి పలు పథకాలు అమలు చేస్తోంది. బడుల రూపురేఖలు మారడంతో విద్యార్థులు ఆహ్లాదకర వాతావరణంలో చదువుకుంటున్నారు. అలాగే ఆశ్రమ పాఠశాల వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సకల సౌకర్యాలతో వసతి, మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో గిరిజన విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపుతున్నారు. పాఠశాలల్లో ప్రవేశాలు కూడా పెరుగుతున్నాయి.
Puzzle of the Day (19.03.2024): Mathematical logic puzzle
ఐటీడీఏ పాఠశాలలు 154
బుట్టాయగూడెం మండలం కోటరామచంద్రాపురం (కేఆర్‌పురం) ఐటీడీఏ పరిధిలో బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు గిరిజన మండలాలు. 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 97,029 మంది గిరిజనులు నివసిస్తున్నట్టు అంచనా. గిరిజన పిల్లల చదువుల కోసం ఐటీడీఏ ద్వారా 154 పాఠశాలలు నిర్వహిస్తున్నారు. వీటిలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గిరిజన ప్రాథమిక పాఠశాలలు, ఆశ్రమ గురుకుల పాఠశాలలు, కళాశాలలు, పోస్టు మెట్రిక్ వసతి గృహాలు ఉన్నాయి. మొత్తంగా 9,676 మంది విద్యార్థులు ఆయా పాఠశాలలో చదువుకుంటున్నారు. వీరికి నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారంతో కూడిన మెనూను పక్కాగా అమలు చేస్తున్నారు.
Children Sports : పిల్లలకు ఆటలతో ఆరోగ్యం.. మనో వికాసం
పథకాలతో తోడ్పాటు
గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది. పథకాల రూపంలో వారి చదువులకు ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేసింది. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా 7,790 మంది విద్యార్థులకు రూ.374.97 లక్షల లబ్ధి చేకూర్చింది.
Writing Exams: సరైన సమాధానంతోపాటు చక్కని రాతకూడా ముఖ్యం
డిజిటల్ చదువులు.. ఉచిత ట్యాబ్‌లు
డిజిటల్ బోధనా విధానాన్ని గిరిజన ప్రాంతంలోని మారుమూరు గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో కూడా అమలు చేస్తున్నారు. 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లు, బైజూస్ కంటెంట్, తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానళ్లు, స్మార్ట్ టీవీలు, సీబీఎస్‌ఈ విద్యావిధానం, ఇంగ్లిష్ మీడియం చదువులు, బాలికలకు స్వేచ్ఛ శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ వంటివి అమలు చేస్తుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
AP Tenth Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు ప్రారంభం.. తొలి రోజు విద్యార్థుల సంఖ్య..!
రోజుకో మెనూ.. రుచికర ఆహారం
సోమవారం నుంచి శనివారం వరకు రోజుకో మెనూతో విద్యార్థులకు రుచి, సుచితో వేడిగా పోషకాహారాన్ని అందిస్తున్నారు. విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు వారంలో 3 రోజులు చిక్కీ, 6 రోజులు ఉడికించిన గుడ్డును తప్పనిసరిగా ఇస్తున్నారు. అలాగే అరటిపండ్లు, రెండు రోజులు చికెన్‌తో భోజ నం అందిస్తున్నారు. దీంతోపాటు విద్యార్థుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
ఐటీడీఏ పరిధిలో గిరిజన మండలాలు 5
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు 25
విద్యార్థులు 5,459
గిరిజన సంక్షేమ
ప్రాథమిక పాఠశాలలు 114
విద్యార్థులు 1,022
పోస్టు మెట్రిక్ వసతి గృహాలు 8
విద్యార్థులు 1,099
Tribal Univeristy: విశ్వవిద్యాలయాలతో ఆదివాసి, గిరిజనులకు మేలు
గురుకుల పాఠశాలలు 7
విద్యార్థులు 2,099
పథకాల లబ్ధి
పథకం విద్యార్థులు లబ్ధి (రూ.లక్షల్లో)
జగనన్న అమ్మఒడి 6,28,969.12
జగనన్న విద్యా దీవెన 7,69,188.10
జగనన్న వసతి దీవెన 7,32,117.75
ICI Ultratech Award: భావి ఇంజనీర్లకు మార్గదర్శకంగా తేజ డిజైన్లు
చదువుకు పట్టం.. అభివృద్ధికి చిహ్నం
అడవి బిడ్డలకు నాణ్యమైన విద్య
ఏజెన్సీ పాఠశాలల్లో ఆధునిక వసతులు
కొండ ప్రాంతాల్లో డిజిటల్ బోధన
నాడు–నేడులో మారిన బడుల రూపురేఖలు