Tribal Univeristy: విశ్వవిద్యాలయాలతో ఆదివాసి, గిరిజనులకు మేలు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ స్టూడెంట్ ఫోరం (టీఎస్‌ఎఫ్) తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో సోమవారం టీఎస్‌ఎఫ్ లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విశ్వ విద్యాలయంతో ఆదివాసీ, గిరిజనులకు మేలు చేకూరుతుందన్నారు. కామన్ స్కూల్ విద్యావిధానం అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు.
Writing Exams: సరైన సమాధానంతోపాటు చక్కని రాతకూడా ముఖ్యం
ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బండి దత్తాత్రి, ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ నారాయణ, ఆదివాసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు రేణుక, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ నాయక్, ఏఐఎస్‌బీ రాష్ట్ర అధ్యక్షుడు జీవారే రాహుల్, జిల్లా అధ్యక్షుడు దాదేరావు, కార్యదర్శి అశోక్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి గణేశ్, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.