ICI Ultratech Award: భావి ఇంజనీర్లకు మార్గదర్శకంగా తేజ డిజైన్లు
ఏలూరు: నగరానికి చెందిన ప్రముఖ సివిల్ ఇంజినీర్ సూరత్ తేజకు ప్రతిష్టాత్మక ఐసీఐ అల్ట్రాటెక్ అవార్డు లభించింది. గృహ నిర్మాణ రంగంలో చేసిన కృషికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. తేజకు సోమవారం విశాఖపట్నంలోని రిషికొండ బీచ్ రోడ్డులోని రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు అందచేశారు.
Tribal Univeristy: విశ్వవిద్యాలయాలతో ఆదివాసి, గిరిజనులకు మేలు
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ దాదాపు 300కు పైగా విభిన్నమైన డిజైన్లతో తేజ రూపొందించిన గృహాలు ఆకర్షణీయంగా భావి ఇంజనీర్లకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. డైట్ కళాశాలలో 2019లో నిర్వహించిన జాతీయ స్థాయి కాన్ఫరెన్స్‌లో ఉత్తమ పరిశోధన బృంద సభ్యుడిగా ఎంపిక కావడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఇండియన్ కాంక్రిట్ ఇన్‌స్టిట్యూట్ వైజాగ్ సెంటర్ చైర్మన్ సీఎన్‌వీ సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి కే శ్రీనివాసరావు, కోశాధికారి జీ మాధురి, కార్యవర్గ సభ్యులు కే రాజశేఖర్, ఎస్.ఆదిశేషు, జీ పాపారావు తదితరులు పాల్గొన్నారు.