Skip to main content

Telangana Best Civil Engineering Colleges : టాప్‌-20 కాలేజీలు ఇవే..

సివిల్‌ ఇంజనీరింగ్‌లో.. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం, మౌలిక వసతులకు ప్రాధాన్యం, హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ బై 2022, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన వంటి పథకాలు.. సివిల్‌ ఇంజనీరింగ్‌ అభ్యర్థుల భవిష్యత్తుకు వేదికలుగా నిలవనున్నాయి.

ఇంకా రహదారులు, వంతెనలు, విమానాశ్రయాలు, హాస్పిటల్స్, సాగునీటి ప్రాజెక్టులు, గృహనిర్మాణాలు, అపార్ట్‌మెంట్లు, ఇతర మౌలిక వసతులన్నింటి ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణం, నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలన్నీ చూసేది సివిల్ ఇంజనీర్లే. సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో భాగంగా ముఖ్యంగా సాలిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్స్, స్ట్రక్చరల్ అనాలసిస్, సర్వేయింగ్, డిజైన్ ఆఫ్ ఆర్‌సీ స్ట్రక్చర్స్, డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్, ట్రాన్స్‌పొర్టేషన్ ఇంజనీరింగ్, క్యాడ్ తదితర అంశాలను బోధిస్తారు. గత కొన్నేళ్లుగా విద్యార్థులు ఆసక్తి చూపుతున్న బ్రాంచ్ ఇది. ఇటు ఉద్యోగావకాశాల పరంగానూ సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు జాబ్ మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది.సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తే..భవిష్యత్తు ఖాయం అనేది నిస్సందేహం. అందుకే సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ను ఎంపిక చేసుకునే వారి సంఖ్య సైతం పెరుగుతోంది. ఇటీవ‌లే తెలుగు రాష్ట్రాల్లో ఇంజ‌నీరింగ్ కాలేజీలో ప్ర‌వేశాల‌కు కౌన్సెలింగ్‌ షెడ్యుల్ కూడా విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.  ఈ నేపథ్యంలో తెలంగాణ‌లోని టాప్‌-20 సివిల్ బ్రాంచ్‌కు సంబంధించిన ఇంజ‌నీరింగ్ కాలేజీల జాబితా మీకోసం..

Engineering college Admissions : ఇంజ‌నీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?

The below list of Civil Engineering colleges is only for reference. It is prepared based on the last ranks admitted in 2021 web based counselling.

Best Engineering Colleges
                   Top 20 Engineering(CIVIL)Colleges in Telangana
College Code College Name Branch Place Last Rank (2021)
JNTH JNTU COLLEGE OF ENGG HYDERABAD CIVIL ENGINEERING HYDERABAD 6986
OUCE O U COLLEGE OF ENGG HYDERABAD CIVIL ENGINEERING HYDERABAD 7570
JNTHM T JNTUH-5 YEAR INTEGRATED MTECH SELF FINANCE CIVIL ENGINEERING KUKATPALLY 9945
CBIT CHAITANYA BHARATHI INSTITUTE OF TECHNOLOGY CIVIL ENGINEERING GANDIPET 11811
GRRR GOKARAJU RANGARAJU INSTITUTE OF ENGG AND TECH CIVIL ENGINEERING MIYAPUR 14870
VASV VASAVI COLLEGE OF ENGINEERING CIVIL ENGINEERING HYDERABAD 17156
JNTS J N T U COLLEGE OF ENGINEERING SULTANPUR CIVIL ENGINEERING SULTANPUR 20085
VJEC V N R VIGNANA JYOTHI INSTITUTE OF ENGG AND TECH CIVIL ENGINEERING BACHUPALLY 21685
JNTM JNTUH COLLEGE OF ENGG MANTHANI CIVIL ENGINEERING MANTHANI 24076
CVRH CVR COLLEGE OF ENGINEERING CIVIL ENGINEERING IBRAHIMPATAN 26568
MGIT MAHATMA GANDHI INSTITUTE OF TECHNOLOGY CIVIL ENGINEERING GANDIPET 28246
SNIS SRINIDHI INSTITUTE OF SCI AND TECHNOLOGY CIVIL ENGINEERING GHATKESAR 32647
MVSR M V S R ENGINEERING COLLEGE (AUTONOMOUS) CIVIL ENGINEERING NADERGUL 33328
JNTR JNTU COLLEGE OF ENGINEERING RAJANNA SIRCILLA CIVIL ENGINEERING AGRAHARAM RAJANNA SIRCILLA 33860
ARJN ARJUN COLLEGE OF TECHNOLOGY AND SCIENCE CIVIL ENGINEERING BATASINGARAM 35588
BVRI B V RAJU INSTITUTE OF TECHNOLOGY CIVIL ENGINEERING NARSAPUR 36504
KITS KAKATIYA INSTITUTE OF TECHNOLOGY AND SCI CIVIL ENGINEERING WARANGAL 37757
VMEG VARDHAMAN COLLEGE OF ENGINEERING CIVIL ENGINEERING SHAMSHABAD 41791
JMTS JYOTHISHMATHI INSTITUTE OF TECHNOLOGY AND SCI CIVIL ENGINEERING KARIMNAGAR 44175
BIET BHARAT INSTITUTE OF ENGG AND TECHNOLOGY CIVIL ENGINEERING IBRAHIMPATNAM 44342

చ‌ద‌వండి: TS EAMCET 2022 Certificate Verification : టీఎస్ ఎంసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..

Published date : 25 Aug 2022 04:40PM

Photo Stories