Top 20 Engineering(Civil)Colleges : క్రేజ్ తగ్గని.. సివిల్ ఇంజనీరింగ్.. టాప్-20 కాలేజీలు ఇవే..
రహదారులు, వంతెనలు, విమానాశ్రయాలు, హాస్పిటల్స్, సాగునీటి ప్రాజెక్టులు, గృహనిర్మాణాలు, అపార్ట్‌మెంట్లు, ఇతర మౌలిక వసతులన్నింటి ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణం, నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలన్నీ చూసేది సివిల్ ఇంజనీర్లే. సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో భాగంగా ముఖ్యంగా సాలిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్స్, స్ట్రక్చరల్ అనాలసిస్, సర్వేయింగ్, డిజైన్ ఆఫ్ ఆర్‌సీ స్ట్రక్చర్స్, డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్, ట్రాన్స్‌పొర్టేషన్ ఇంజనీరింగ్, క్యాడ్ తదితర అంశాలను బోధిస్తారు. గత కొన్నేళ్లుగా విద్యార్థులు ఆసక్తి చూపుతున్న బ్రాంచ్ ఇది. ఇటు ఉద్యోగావకాశాల పరంగానూ సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు జాబ్ మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. రియాలిటీ రంగం దూకుడు మీదుండటం సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు కలిసొస్తోంది. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తే..భవిష్యత్తు ఖాయం అనేది నిస్సందేహం. అందుకే సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ను ఎంపిక చేసుకునే వారి సంఖ్య సైతం పెరుగుతోంది. ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యుల్ కూడా విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో టాప్-20 సివిల్ బ్రాంచ్‌కు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీల జాబితా మీకోసం..
Top Engineering(CSE)Colleges : సీఎస్‌ఈ బ్రాంచ్‌కు టాప్-20 ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే..
The below list of Civil Engineering colleges is only for reference. It is prepared based on the last ranks admitted in 2021 web based counselling.
Top 20 Engineering(CIVIL)Colleges in AP | ||||
College Code | College Name | Branch | Place | Last Rank (2021) |
AUCE | A U COLLEGE OF ENGG. VISAKHAPATNAM | CIVIL ENGINEERING | VISAKHAPATNAM | 7686 |
JNTK | JNTUK COLLEGE OF ENGG. KAKINADA | CIVIL ENGINEERING | KAKINADA | 9862 |
JNTV | JNTUK COLLEGE OF ENGINEERING VIZIANAGARAM | CIVIL ENGINEERING | VIZIANAGARAM | 17427 |
JNTA | JNTUA COLLEGE OF ENGG. ANANTAPURAMU | CIVIL ENGINEERING | ANANTAPURAMU | 20436 |
GVPE | GAYATHRI VIDYA PARISHAD COLL. OF ENGINEERING | CIVIL ENGINEERING | VISAKHAPATNAM | 23503 |
SVUC | S V U COLLEGE OF ENGG. TIRUPATHI | CIVIL ENGINEERING | TIRUPATHI | 27527 |
JNTP | JNTUA COLLEGE OF ENGG PULIVENDULA | CIVIL ENGINEERING | PULIVENDULA | 35948 |
ANIL | ANIL NEERUKONDA INSTITUTE OF TECHNOLOGY AND SCI | CIVIL ENGINEERING | BHEEMUNIPATNA M | 36416 |
VSPT | VISAKHA INST OF ENGG AND TECHNOLOGY | CIVIL ENGINEERING | VISAKHAPATNAM | 37165 |
ANURSF | ADI KAVI NANNAYA UNIVERSITY COLLEGE OF ENGG.-SELF FINANCE | CIVIL ENGINEERING | RAJAHMUNDRY | 42296 |
VRSE | V R SIDDHARTHA ENGINEERING COLLEGE | CIVIL ENGINEERING | VIJAYAWADA | 42414 |
JNTC | JNTUA COLLEGE OF ENGINEERING. KALIKIRI | CIVIL ENGINEERING | KALIKIRI | 42978 |
PPSV | PRASAD V POTLURI SIDDHARTHA INSTT OF TECHNOLOGY | CIVIL ENGINEERING | VIJAYAWADA | 45798 |
VITB | VISHNU GRP OF INSTNS - VISHNU INST OF TECHNOLOGY | CIVIL ENGINEERING | BHIMAVARAM | 47082 |
GMRI | G M R INSTITUTE OF TECHNOLOGY | CIVIL ENGINEERING | RAJAM | 47125 |
GPRE | G P R ENGINEERING. COLLEGE | CIVIL ENGINEERING | KURNOOL | 50950 |
KVSR | DR.K.V.SUBBA REDDY INST. OF TECHNOLOGY | CIVIL ENGINEERING | KURNOOL | 51036 |
KUPM | KUPPAM ENGINEERING COLLEGE | CIVIL ENGINEERING | KUPPAM | 52808 |
PRAG | PRAGATI ENGINEERING COLLEGE | CIVIL ENGINEERING | PEDDAPURAM | 53452 |
CEVP | CHAITANYA ENGINEERING COLLEGE | CIVIL ENGINEERING | VISAKHAPATNAM | 53744 |
కాలేజీ ఎంపికలో..
సివిల్ ఇంజనీరింగ్‌లో చేరాలనుకుంటున్న విద్యార్థులు ఇన్‌స్టిట్యూట్ ఎంపికలో అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థులు సదరు కాలేజ్‌ను ఎంచుకునే ముందుకు అక్కడి ఫ్యాకల్టీ, ప్రాక్టికల్స్, ల్యాబ్ వర్క్, ఇండస్ట్రీతో కాలేజీకి సంబంధాలు, ప్లేస్‌మెంట్స్ వంటివన్నీ పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవడం మేలు.
Civil Engineering: ఎవర్‌గ్రీన్ సివిల్ ఇంజనీరింగ్.. కెరీర్ అవకాశాలు ఇలా..
Engineering college Admissions : ఇంజనీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?