AP Tenth Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు ప్రారంభం.. తొలి రోజు విద్యార్థుల సంఖ్య..!
అనంతపురం: జిల్లావ్యాప్తంగా సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 142 కేంద్రాల్లో తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు 34,074 మంది విద్యార్థులకు గాను 31,579 మంది హాజరయ్యారు. 2,495 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు.
Children Sports : పిల్లలకు ఆటలతో ఆరోగ్యం.. మనో వికాసం
పరీక్షా కేంద్రం తనిఖీ
అనంతపురం నగరంలో మొదటి రోడ్డులోని శారదా నగరపాలక ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఎం.గౌతమి తనిఖీ చేశారు. ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది సమన్వయంతో పని చేసి పరీక్షలు సజావుగా సాగేలా చూడాలని కోరారు.
March 18th Current Affairs: నేటి ముఖ్యమైన కరెంటు అఫైర్స్ ఇవే
● జిల్లా పరీక్షల పరిశీలకులు, ప్రాథమిక విద్య ఆర్జేడీ రాఘవరెడ్డి కూడా వివిధ కేంద్రాలను తనిఖీ చేశారు. ముందుగా కూడేరు పోలీసు స్టేషన్‌లో ప్రశ్నపత్రాల తరలింపును ఆయన పరిశీలించారు. అక్కడి నుంచి కణేకల్లుకు చేరుకుని మూడు పరీక్ష కేంద్రాలు, రాయదుర్గంలో మూడు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం అనంతపురం చేరుకుని పొట్టి శ్రీరాములు నగర పాలక ఉన్నత పాఠశాల, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగరపాలక ఉన్నత పాఠశాలల్లో ఓపెన్ స్కూల్ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఆయన వెంట డీఈఓ వరలక్ష్మీ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ తదితరులు ఉన్నారు.