Dussehra Holidays 2024: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం, ఒకరోజు అధికంగా..

సాక్షి, అమరావతి: సాక్షి, అమరావతి: అక్టోబర్‌ 3వ తేదీ నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు విద్యామంత్రి లోకేశ్‌ చెప్పారు. ఆయన శుక్రవారం పాఠశాల విద్యపై సమీక్షించారు. ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందు నుంచే సెలవులు ఇస్తున్నామని చెప్పారు.


అక్టోబర్‌ 13 వరకు సెలవులు ఉంటాయని తెలిపారు. ఒక రోజు ముందు నుంచే అక్టోబర్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మొత్తం 10 రోజులు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది. 

2024-25 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే..

➤☛ దసరా సెలవులు అక్టోబరు 3 నుంచి 13 వరకు ఉండనున్నాయి.
➤☛ క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.
➤☛ అక్టోబరు 31న దీపావళి సెలవు
➤☛ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు.
➤☛ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags