Due to Heavy Rain School Holiday : భారీ వర్షం కారణంగా స్కూల్స్‌కు సెలవులు.. ఈ నిర్ణయం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : రాష్ట్ర‌వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెల్సిందే. వర్షం కారణంగా పాఠశాలలకు సెలవు ఇవ్వడంపై ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులే నిర్ణయం తీసుకోవచ్చునని జిల్లా కలెక్టర్లు ప్రకటించారు.

పాఠశాలలకు వర్షం కారణంగా సెలవు ఇవ్వడంపై నియమ, నిబంధనలను పాఠశాల విద్యాశాఖ ఒక సర్కులర్‌ను జారీ చేసింది. అందులో కుండపోత వర్షం, భారీ వర్షం కురిసినప్పుడు మాత్రమే పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని స్పల్పంగాను, వర్షపు జల్లులు పడుతున్న సమయంలో సెలవు ఇవ్వవలసిన అవసరం ఉండదని సెలవు ప్రకటించేందుకు పాఠశాల ప్రారంభానికి మూడు గంటల ముందు ప్రకటించాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే కొన్ని జిల్లాలోని స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులను ప్ర‌క‌టించారు. 

Also Read :  Success Story : ఎలాంటి కోచింగ్ లేకుండానే ఆరు ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలు కొట్టానిలా.. నా స‌క్సెస్ ప్లాన్ ఇదే..

పాఠశాల విద్యార్థుల భద్రతకు..

జిల్లా ముఖ్య విద్యాధికారి జిల్లా లోతట్టు ప్రాంతాలు, బాధిత ప్రాంతాలు వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలపై ఒక నివేదికను తయారు చేసి పరిశీలించి జిల్లా కలెక్టర్లకు పంపించాల్సి వుంటుంది. వర్షపు నీరు నిల్వ ఉన్న ఎడల వాటిని తొలగించేందుకు, పాఠశాల విద్యార్థుల భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వవలసి వుంటుందని కలెక్టర్లు ప్రకటనలో ఆదేశాలను జారీ చేశారు. తమిళనాడుతో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా భారీ వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెల్సిందే.

➤ రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవులు...ఎందుకంటే...

కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రతగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. కేరళలో ఈ రెండు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, పుదుచ్చేరిలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా పుదుచ్చేరి, కారైకల్‌లోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. అటు.. తమిళనాడులోని 10 జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

లోతట్టు ప్రాంతాలు..


కేరళ, తమిళనాడులో గత నాలుగు రోజులుగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. పతనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లో వరుసగా 7 సెం.మీ, 5 సెం.మీ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా జనం అవస్థలు పడుతున్నాయి. కాలనీల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

☛ Success Story : నాడు క్లాసురూమ్ నుంచి బయటికి వ‌చ్చా.. నేడు వేల కోట్లు సంపాదించా..!

#Tags