Due to Bandh School and Colleges Holidays : స్కూల్స్, కాలేజీలు బంద్.. కారణం ఇదే.. వరుసగా నాలుగు రోజులు సెలవులతో..?
టెక్ కంపెనీలకు సెప్టెంబర్ 30వ తేదీ (శనివారం), అక్టోబర్ 1వ తేదీన (ఆదివారం) సెలవులు ఉంటాయి. అక్టోబర్ 2వ తేదీన (సోమవారం) గాంధీ జయంతి సందర్భంగా పబ్లిక్ హాలిడే. దీంతో వరుసగా నాలుగు రోజులు పాటు సెలవులు వచ్చాయి. దీంతో నగరవాసులు తమ సొంతూళ్లకు వెళ్తున్నారు.
☛ School Holidays Extended 2023 : అక్టోబర్ 8వ తేదీ వరకు స్కూల్స్‌కు సెలవులు.. ఎందుకంటే..?
రాష్ట్ర బంద్ సందర్భంగా..
ఈ బంద్‌కు 100కు పైగా సంఘాలు మద్దతు ప్రకటించాయి. సెప్టెంబర్ 26వ తేదీన (మంగళవారం) నిర్వహించిన బంద్ బంద్ జయప్రదమైన విషయం తెల్సిందే. నేడు నిర్వహించే రాష్ట్ర బంద్ సందర్భంగా వాహన సంచారం, అంగళ్లు, హోటల్, సినిమా థియేటర్లు, మాల్స్, పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అన్నీ బంద్ అయ్యే అవకాశముంది. ఒక్కూట వాటాళ్ నాగరాజ్ మాట్లాడుతూ శాంతియుతంగా బంద్ జరుగుతుందన్నారు.
ప్రైవేటు స్కూళ్ల, కాలేజీలు..
బెంగళూరుతో పాటుగా అన్ని జిల్లాల్లో కూడా ధర్నా, ర్యాలీలు జరుపుతామని కరవే అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ శెట్టి తెలిపారు. హోటళ్లు, సినీరంగం, ప్రైవేటు క్యాబ్‌లు, ఆటో సంఘాలు, ప్రైవేటు స్కూళ్ల, కాలేజీల సంఘాలు సంఘీభావం తెలిపాయి. వాహనాలు ఉండకపోవడం వల్ల స్కూళ్లు కూడా మూతపడవచ్చు. ఆర్టీసీ రవాణా బస్సుల సంచారం కూడా తక్కువగా ఉండవచ్చు. రాష్ట్రమంతటా అన్ని సినిమా థియేటర్లు బంద్ కానున్నాయి. అనేకమంది నటీనటులు మద్దతు తెలిపారు. అనేక విశ్వవిద్యాలయాల్లో పరీక్షలను వాయిదా వేశారు. ప్రధాన రహదారుల్లో రాస్తారోకోలు చేయాలని సంఘాలు నిర్ణయించాయి.
వరుసగా ఐదు రోజులు సెలవులు రావడంతో..
వరుసగా ఐదు రోజులు సెలవులు రావడంతో బెంగళూరులో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. బుధవారం సాయంత్రం కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గంటల తపబడి వాహనదారులు రోడ్లపైనే వేచి ఉన్నారు. పాఠశాల విద్యార్థులు సైతం అర్థరాత్రి వరకు రోడ్లపైనే గడిపారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల మధ్య ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిపోయిందని పోలీసులు తెలిపారు.
ఐదు రోజులు..
ఈ వీకెండ్‌కు ఐదు రోజులు సెలవులు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం ట్రాఫిక్ ఒక్కసారిగా పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సాధారణ రోజుకు రెండింతలు ట్రాఫిక్ పెరిగిందని వెల్లడించారు. సాధారణంగా రోడ్లపై వాహనాల సంఖ్య 1.5 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. కానీ బుధవారం ఆ సంఖ్య ఏకంగా 3.5 వరకు పెరిగిందని స్పష్టం చేశారు. వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.