School Holidays Extended 2023 : అక్టోబర్ 8వ తేదీ వరకు స్కూల్స్‌కు సెలవులు.. ఎందుకంటే..?
1వ తరగతి నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులకు త్రైమాసిక సెలవులను అక్టోబరు 8వ తేదీ వరకు పొడిగించారు.
☛ NTA NEET, JEE Exam Dates 2023 : నీట్, జేఈఈ-2024 పరీక్షల తేదీ ఇవే.. ఏఏ పరీక్ష ఎప్పుడంటే..?
మొదట సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబరు 2వ తేది వరకు ఐదు రోజులు పాటు సెలవులు ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే ఉపాధ్యాయులకు రెండో సెమిస్టర్‌పై శిక్షణ జరుగుతుండడంతో ఈ సెలవులను మరో ఆరు రోజులు పాటు అనగా.. అక్టోబర్ 8వ తేదీ వరకు పొడిగించారు. ఇదే టైమ్‌లో 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు గతంలో ప్రకటించిన విధంగానే సెలవులు అక్టోబరు 3వ తేది నుంచి సెలవులు ఉంటాయని తమిళనాడు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మళ్లి ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు అక్టోబర్ 10 నుంచి 12 తేదీ వరకు జరగనున్నాయి. కనుక 1 నుంచి 5వ తరగతి స్కూల్స్ పిల్లలకు అక్టోబర్ 13వ తేదీన స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి.
ఇటు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అక్టోబర్ నెలలో భారీగా సెలవులు రానున్నాయి. అక్టోబర్ 1వ తేదీన ఆదివారం, అలాగే 2వ తేదీ గాంధీ జయంతి. కనుక అక్టోబర్ 1,2 వ తేదీల్లో వరుసగా రెండు రోజులు పాటు స్కూల్స్, కాలేజీలకు సెలవులు రానున్నాయి. అలాగే అక్టోబర్ 8వ తేదీన ఆదివారం స్కూల్స్, కాలేజీలకు సాధరణ సెలవు ఉన్న విషయం తెల్సిందే.
తెలంగాణలో భారీగానే..
తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అందుకే స్కూల్స్, కాలేజీలకు ముందుగానే హాలీడేస్‌ను ప్రకటించారు. అలాగే ఇప్పటికే చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు స్కూల్స్‌కు, కాలేజీలకు, ప్రభుత్వ కార్యాలయాలకు తమ క్యాలెండర్‌లో సెలవులను పొందుపరిచారు. తెలంగాణలో ఇక అక్టోబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు స్కూల్స్, కాలేజీలకు దసరా, బతుకమ్మ సెలవులు ఉండనున్నాయి. మొత్తం 13 రోజులు పాటు తెలంగాణలో వరుసగా దసరా సెలవులు ఇచ్చారు. తిరిగి అక్టోబర్ 26వ తేదీన (గురువారం) పాఠశాలల పునఃప్రారంభం కానున్నాయి.
దసరా సెలవులు మొత్తం ఎన్ని రోజులంటే..?
అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ,ప్రైవేటు స్కూల్స్‌కు అక్టోబర్ 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులు ఇచ్చారు. మొత్తం 10 రోజుల పాటు స్కూల్స్‌కు దసరా సెలవులు రానున్నాయి. తిరిగి అక్టోబర్ 25వ తేదీన (బుధవారం) పాఠశాలల పునఃప్రారంభం కానున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవులు తక్కువగానే ఉన్నాయి.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
నెల చివరిలో కూడా వరుసగా..
అక్టోబర్ 28వ తేదీ నాల్గోవ శనివారం, అక్టోబర్ 29న ఆదివారం ఉన్న విషయం తెల్సిందే. దీంలో అక్టోబర్ 28,29వ తేదీల్లో మరో రెండు రోజులు పాటు వరుసగా స్కూల్స్, కాలేజీలకు సెలవులు రానున్నాయి. ఈ అక్టోబర్ నెలలో మొత్తం ఐదు ఆదివారాలు వచ్చాయి. దీంతో అక్టోబర్ నెలలో తెలంగాణలో మొత్తం 18 రోజులు సెలవులు రానున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 15 రోజులు పాటు సెలవులు రానున్నాయి. మరోవైపు ఉపాధ్యాయులు మాత్రం ఇలా భారీగా సెలవులు వస్తుంటే.. సిలబస్ ఎలా పూర్తి చేయాలంటున్నారు.
Tags
- school holidays extended
- school holidays
- october school holidays 2023
- october month school holidays 2023 list
- tamil nadu school holidays october 2023
- breaking news about school holiday
- school holiday tomorrow
- tamil nadu school holiday list 2023
- government schools
- Festivals of India
- october month holidays 2023 telugu news
- Students
- AP Schools
- AP Holidays