Educational Development: శాస్త్రీయ‌ప‌ర‌మైన విద్యావిధానం అమ‌లు

దేశంలో ఉన్న మూడు ర‌కాల విద్యను మిన‌హాయించి విద్యార్థుల‌కు శాస్త్రీయ‌ప‌ర‌మైన విద్య‌ను అందించాల‌న్న ఆలోచ‌న‌ని ప్ర‌భుత్వం వ‌ద్ద‌కు వెళ్ళాల‌ని పేర్కొన్నారు విద్యార్ది సంఘం అధ్య‌క్షులు. వారి మాట‌లు వివ‌రంగా...
student union president about education system

సాక్షి ఎడ్యుకేష‌న్: సమాజంలో అసమానతలు లేని శాసీ్త్రయ విద్యా విధానాన్ని అమలు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దింటి రామకృష్ణ అన్నారు. మంగళవారం సంఘ కార్యాలయంలో జరిగిన ఉమ్మడి జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. నేడు దేశంలో,రాష్ట్రంలో కార్పొరేట్‌ విద్య, ప్రైవేట్‌ విద్య, ప్రభుత్వ విద్య అని మూడు రకాల విధానం కొనసాగుతోందని అన్నారు.

Study Abroad: భార‌తీయ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌.. 30 వేల మందికి ఫ్రాన్స్ సాద‌ర‌ ఆహ్వానం..!

డబ్బున్నోళ్లు కార్పొరేట్‌ విద్యను, మధ్యతరగతి వారు ప్రైవేటు విద్యను, పేదలు, బడుగు బలహీన వర్గాల వారు ప్రభుత్వ విద్యను అభ్యసిస్తున్నారన్నారు. పేదలు చదివే ప్రభుత్వ విద్య అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజురోజుకు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్నాయని అన్నారు. వివక్ష, అసమానతలు లేని శాసీ్త్రయపరమైన విద్యాఆవిధానం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

National Teachers Day 2023: ఉపాధ్యాయుల దినోత్స‌వం సందర్భంగా ఉత్త‌మ పురస్కారాలు

పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అంగడి కుమార్‌, జిల్లా నాయకులు రాజు, రమేశ్‌, మారుతి ఎల్లయ్య, ఏ.దేవేందర్‌, అరుణ్‌, వేణుగోపాల్‌, ధనుష్‌, వర్మ, విష్ణువర్ధన్‌, హరీష్‌, హర్షవర్ధన్‌, మణికంఠ, జీవన్‌పాల్‌, రమేశ్‌, సంజయ్‌ పాల్గొన్నారు.

పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పెద్దింటి రామకృష్ణ

#Tags