Schools Holidays Due To Heavy Rain : స్కూల్స్‌కు సెలవులు ప్ర‌క‌టించిన వివిధ జిల్లా కలెక్టర్లు.. ఇంకా మ‌రో రెండు రోజులు కూడా..

సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అప్రమత్తమైన అధికారులు ఆ 5 జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించారు.

భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఏపీ రాష్ట్రంలో మ‌రో నాలుగు రోజులు పాటు.. అన‌గ‌ గురువారం వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మ‌రో నాలుగు రోజులు పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో... స్కూల్స్‌కు సెల‌వులు పొడిగించే అవ‌కాశం ఉంది.

ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలో తెల్లవారుజాము నుంచి వర్షం పడుతోంది. కొన్ని చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తిరుమలలో కురుస్తున్న భారీ వర్షంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు.. మ‌రో
నెల్లూరు జిల్లాలోని.. ఇందుకూరిపేట, కోవూరు, కొడవలూరు మండలాల్లో ఎడతెరిపిలేకుండా భారీగా కురుస్తోంది. నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే 0861-2331261, 7995576699, 1077 నంబర్లకు కాల్‌ చేయాలని ప్రజలకు సూచించారు. డివిజన్‌, మండల కేంద్రాల్లోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని.. రెవెన్యూ, నీటిపారుదల అధికారులు పెన్నా నది గట్లు పరిశీలించాలని ఆదేశించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్‌ చెప్పారు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు. 

Dasara Holidays 2024 Extended : విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌... దసరా సెల‌వులు పొడిగింపు.. కార‌ణం ఇదే...!

ప్రకాశం జిల్లా ఒంగోలు, మద్దిపాడు, గిద్దలూరు, కొమరోలులో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షంతో ఒంగోలులోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. బాపట్ల, చీరాల, వేటపాలెం, చినగంజాం, కారంచేడు, పర్చూరు, మార్టూరు, ఇంకొల్లు, కొల్లూరు, వేమూరు, అద్దంకి, యద్దనపూడి, జె.పంగులూరు, బల్లికురవ, నిజాంపట్నం, కర్తపాలెంలో వర్షం కురుస్తోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం, ఉయ్యూరు, అవనిగడ్డలో ఈదరుగాలులతో వర్షం పడుతోంది. విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. అన్నమయ్య జిల్లాలోనూ వర్షం కురుస్తోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ సెలవు ప్రకటించారు.

తెలంగాణ‌లో కూడా..
తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు నేటితో దసరా సెలవులు ముగియనున్నాయి. రేపటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. కాలేజీలు మాత్రం నేటి నుంచే తెరుచుకోనున్నాయి. అటు ఏపీలో నేటి నుంచి పాఠశాలలు, కాలేజీలు స్టార్ట్ అవుతాయి. ఈ నెల 2 నుంచి 13 వరకు దసరా సెలవుల అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతులకు హాజరుకానున్నారు. తెలంగాణ ఇంటర్ కాలేజీలను ఉ.9 గంటల నుంచి సా.5 గంటల వరకు నిర్వహించనున్నారు.

2024-25 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే...

➤☛ క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.
➤☛ అక్టోబరు 31న దీపావళి సెలవు
➤☛ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు.
➤☛ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు

#Tags