AP Schools & Colleges Dussehra Holidays 2023 : ఆంధ్ర‌ప్రదేశ్‌లో దసరా సెలవులు.. మొత్తం ఎన్ని రోజులు అంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు దసరా సెలవులు త్వ‌ర‌లోనే రానున్నాయి. ఈ సారి తెలంగాణ‌లో కంటే.. ఏపీలోనే దసరా సెలవులు త‌క్కువ‌గానే ఉన్నాయి. ఈ సారి తెలంగాణ‌లో మొత్తం 13 రోజులు దసరా సెలవులు ఇచ్చారు.
AP Schools and Colleges Dussehra Holidays 2023 Details in Telugu

కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం 10 రోజులు ద‌స‌రా సెల‌వులు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండ‌గ‌ను అత్యంత ఘ‌నంగా జ‌రుపుకుంటారు. అందుకే స్కూల్స్, కాలేజీలకు ముందుగానే హాలీడేస్ ను ప్ర‌క‌టించారు. అలాగే ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు స్కూల్స్‌కు, కాలేజీల‌కు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు త‌మ క్యాలెండర్‌లో సెల‌వులను పొందుప‌రిచారు.

☛ School & Colleges Holiday list in September 2023 : సెప్టెంబ‌ర్‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగానే సెల‌వులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

ఈ సారి త‌గ్గిన సెల‌వులు ఇలా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌భుత్వ‌,ప్రైవేటు స్కూల్స్‌కు అక్టోబర్ 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులు ఇచ్చారు. మొత్తం 10 రోజుల పాటు స్కూల్స్‌కు ద‌స‌రా సెల‌వులు రానున్నాయి. తిరిగి అక్టోబర్ 25వ తేదీన (బుధ‌వారం) పాఠశాలల పునఃప్రారంభం కానున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్కూళ్లకు సంబంధించిన 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌లో ఈ సెల‌వుల పూర్తి వివ‌రాల‌ను పాఠశాల విద్యాశాఖ పొందిప‌రిచారు.క్రిస్మస్‌ సెలవులను కూడా ఏడు నుంచి అయిదుకు తగ్గించారు. జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. ప్రతి నెల మూడో శనివారం పేరెంట్‌, టీచర్‌ మీటింగ్‌ నిర్వహించాలి. ప్రతి నెల మొదటి వారంలో పాఠశాల విద్యా కమిటీ సమావేశాలు జరగాలి.

☛ September 14, 15 Schools Holidays : రేపు, ఎల్లుండు స్కూల్స్‌కు సెల‌వులు.. కార‌ణం ఇదే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ 2023-24లో సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..:

☛ అక్టోబర్ 14 నుంచి 24 వరకు దసరా సెలవులు
☛ జనవరి 9, 2024 నుంచి 18, 2024 వరకు సంక్రాంతి సెలవులు
☛ డిసెంబ‌ర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వ‌ర‌కు క్రిస్ట‌మ‌స్ సెల‌వులు (మిష‌న‌రీ స్కూల్స్‌కు మాత్ర‌మే..)
☛ ఇంకా దీపావ‌ళి, ఉగాది, రంజాన్ మొద‌లైన పండ‌గ‌ల‌కు ఆ రోజును బ‌ట్టి సెల‌వులు ఇవ్వ‌నున్నారు.

#Tags