Sankranti Holidays Extended 2024 Three Days : బ్రేకింగ్ న్యూస్.. మరో మూడు రోజులు పాటు సంక్రాంతి సెలవులు పొడిగింపు.. కారణం ఇదే..!
దీంతో ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులను మరో 3 రోజులు పొడిగించడంతో... స్కూల్స్ తిరిగి జనవరి 22వ తేదీన పాఠశాలలు తిరిగి తెరచుకోనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యశాఖ కమిషనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ ప్రకటించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే తెలంగాణలో స్కూల్స్ సెలవులు పొడిగించే అవకాశం ఉంది. అలాగే జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా.. దేశవాప్తంగా చాలా స్కూల్స్, కాలేజీలకు సెలవులను ప్రకటించారు ఆయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.
☛ AP Holidays 2024 List : ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ సెలవులు ఇవే.. స్కూల్స్, కాలేజీలకు మాత్రం..
జనవరి 22వ తేదీన కూడా.. సెలవు..?
దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా జనవరి 22వ తేదీన సెలవు ఇచ్చే అవకాశం ఉంది. ఒక వేళ జనవరి 22వ తేదీన (సోమవారం) స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇస్తే.. జనవరి 23వ తేదీన (మంగళవారం) స్కూల్స్ తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. దీంతో స్కూల్స్, కాలేజీ విద్యార్థులకు ఈ జనవరి నెల పండగే.. పండగలా ఉంది.
☛ Telangana Holidays 2024 List : 2024 స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇవే.. ఏడాదిలో మొత్తం ఎన్ని రోజులు హాలిడేస్ అంటే..?
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా 13 రోజులు పాటు సెలవులు వచ్చాయి. అలాగే తెలంగాణలో కూడా దాదాపు వారం రోజులు సెలవులు వచ్చాయి. తెలంగాణ సర్కార్ పాఠశాలలకు జనవరి 12వ తేదీ నుంచి సెలవులు ప్రకటించింది. అంటే దాదాపు 6 రోజులు పాటు సెలవులు ఇచ్చింది. జూనియర్ కాలేజీలకు కూడా మొత్తం 4 రోజులు సెలవులు ప్రకటించింది. వీరికి జనవరి 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు.
మరో మూడు రోజలు స్కూల్స్‌కు సెలవులు అధనంగా రావడంతో..
ఇటు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించారు. జనవరి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అంటే వారం రోజులు సెలవులు వచ్చాయి. ఏపీలో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవులు పదిరోజులు ఉన్నాయి. జనవరి 9వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ వరకు సెలవులు ఉంటాయని అధికారులు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే. పాఠశాల విద్యార్థులకు పదిరోజులు సంక్రాంతి సెలవులు వచ్చాయి. అంటే ఏపీలో పాఠశాలలు తిరిగి జనవరి 19న ప్రారంభం కావాల్సిందే. కానీ ఏపీ ప్రభుత్వం మరో మూడు రోజులు పాటు స్కూల్స్ సెలవులు ఇవ్వడంతో.. ఈ స్కూల్స్ జనవరి 22వ తేదీ (సోమవారం) తిరిగి ప్రారంభం కానున్నాయి.
2024లో సెలవులు వివరాలు ఇవే..
☛ 15-01-2024న (సోమవారం) సంక్రాంతి
☛ 16-01-2024న (మంగళవారం) కనుమ
☛ 26-01-2024 (శుక్రవారం) రిపబ్లిక్ డే
☛ 08-03-2024 (శుక్రవారం) మహాశివరాత్రి
☛ 25-03-2024 (సోమవారం) హోలీ
☛ 29-03-2024 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే
☛ 05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్ జయంతి)
☛ 09-04-2024 (మంగళవారం) ఉగాది
☛ 11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
☛ 17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్
Tags
- Breaking News Schools Holidays 2024
- Sankranti Holidays Extended 2024 Three Days News
- AP Sankranti Holidays Extended 2024 Three Days
- Three Days AP Sankranti Holidays Extended 2024
- AP Schools Sankranti Holidays Extended 2024 News in Telugu
- 3 days AP Schools Sankranthi Holidays Extended 2024
- AP Schools Holidays
- AP School Sankranthi Holidays Extended 2024 latest news