Govt School Development: సర్కారు బడుల్లో సమూల మార్పులు.. ఇకపై విద్యలో అభివృద్ధి ఇలా..!

ఏపీ ప్రభుత్వం నాడు-నేడు పథకంతో పాఠశాలల్లో ఇప్పటికే రూపు రేకలు మార్చేసారు. విద్యార్థులకు ఉన్నత చదువును అందించేందుకు అన్ని విధాల చర్యలు చేపట్టారు..

అమరావతి: ప్రభుత్వ విద్యకు జగనన్న ప్రభుత్వం పట్టం కట్టింది. అలా ఇలా కాదు.. అక్షరానికి అగ్రాసనం వేసి, సౌకర్యాలకు సమున్నత స్థానం కల్పించారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనట్లుగా.. నిధులు కేటాయించి సర్కారు బడి రూపురేఖల్ని సమూలంగా మార్చింది. కార్పొరేట్‌ విద్యా రంగం ఈర్షపడేలా కొత్త పాఠశాల భవనాలు.. టాయిలెట్ల నుంచి కాంపౌండ్‌ వాల్‌ వరకు 11 రకాల సదుపాయాలు కల్పించారు. నాడు–నేడు రెండు దశల్లో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు చేశారు. తెలుగు, ఇంగ్లిషులో టెక్టస్ట్‌ బుక్స్‌ అందించి ప్రతి విద్యార్థి ఇంగ్లిష్‌ను సులభంగా నేర్చుకునేలా చర్యలు తీసుకున్నారు. కేవలం విద్యా సంస్కరణల కోసం జగనన్న ప్రభుత్వం జూన్‌ 2019 నుంచి ఫిబ్రవరి 2024 వరకు రూ.72,919 కోట్లు ఖర్చు చేసి విద్యా రంగంలో సంస్కరణల పట్ల తన నిబద్ధత చాటుకుంది.

AP Inter Advanced Supplementary Fees: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షకు ఫీజు చెల్లింపు.. చివరి తేదీ ఇదే..

సర్కారు బడిలో డిజిటల్‌ శకం
ఒకప్పుడు బ్లాక్‌ బోర్డులపై రాసే సుద్దముక్కలు లేక ఇబ్బందులు పడిన దశ నుంచి ప్రభుత్వ బడి డిజిటల్‌ బోధనతో సరికొత్త హంగులు సంతరించుకుంది. స్కూల్‌లో చదువుకునేందుకు అనువైన వాతావరణం ఉన్నప్పుడే చిన్నారులు ఆసక్తి చూపుతారన్న ఆలోచనతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మనబడి నాడు–నేడు పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 11 రకాల సదుపాయాలు కల్పించారు.  

DRDO: స్వదేశీ క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

సరికొత్తగా..  
నాడు–నేడులో పాఠశాలల రూపురేఖలు మారాయి. ఈ పనులన్నీ పూర్తి పారదర్శకతతో కొనసాగేందుకు తల్లిదండ్రుల కమిటీని ఏర్పాటు చేశారు. నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లోను ఇంటర్నెట్‌తో పాటు 62 వేల ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానళ్లతో 3డీ డిజిటల్‌ పాఠాలను బోధిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్‌ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్‌ శిక్షణ అందిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్‌ వరకు బైజూస్‌ పాఠాలను ఉచితంగా బోధిస్తున్నారు. దేశంలో 25 వేలఐఎఫ్‌పీలు ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 62 వేల డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఒక విప్లవం..

BED Colleges: బీఈడీ కళాశాలల్లో తనిఖీలు ప్రారంభం

అమ్మ ఒడితో అండగా..  
ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ అందించేందుకు, అంతర్జాతీయంగా రాణించాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ‘మనబడి నాడు–నేడు’ కింద డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులతో పాటు జగనన్న అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు–వాటి నిర్వహణకు ప్రత్యేక నిధి వంటివి ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా, 72,20,633 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో 43.10 లక్షల మంది చదువుతున్నారు. వీరికి అత్యున్నత ప్రమాణాలతో విద్య కోసం 2019–20 విద్యా సంవత్సరంలోనే ప్రభుత్వం సంస్కరణలు మొదలుపెట్టింది. ఒకటి నుంచి ఇంటర్‌ వరకు చదివే పిల్లల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు చొప్పున జమ చేశారు. 

CET 2024: సీఈటీ–2024.. ఉన్నత చదువులకు మెట్టు..

టెక్‌ ప్రపంచంలో రాణించేలా.. 
ప్రస్తుత టెక్‌ ప్రపంచంలో మన విద్యార్థులు రాణించేందుకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న టెక్నాలజీ కోర్సులపై పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను భవిష్యత్‌ టెక్‌ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 2024–25 విద్యా సంవత్సరం నుంచి ఫ్యూచర్‌ స్కిల్స్‌ కోర్సుల్ని ప్రవేశ పెడుతోంది. ఆరు నుంచి ఇంటర్‌ వరకు మూడు దశల్లో విద్యార్థులకు ఫ్యూచర్‌ స్కిల్‌ శిక్షణ ఇవ్వనున్నారు.

టెక్‌ అంశాల్లో విద్యార్థుల ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేందుకు ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్ (ఎంఎల్‌), 3డీ ప్రింటింగ్, గేమింగ్‌ వంటి 10 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ లెర్నింగ్ కోసమే దాదాపు రూ.2400 కోట్లు ఖర్చు చేస్తోంది. నాస్కామ్, జేఎన్‌టీయూ నిపుణులు, ఏపీ ఎస్సీఈఆరీ్ట, స్వతంత్ర నిపుణులతో ఫ్యూచర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఫెసిలిటేటర్స్‌గా నియమిస్తోంది.    

Department of Education: వయోజన విద్యకు శ్రీకారం

విద్యార్థుల ప్రతిభకు పట్టం 
విద్యా రంగంలో సంస్కరణల కొనసాగింపుగా, విద్యలో నాణ్యత, నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు.. విద్యార్థుల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మరో గొప్ప ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీల్లో చదువుకుని ప్రతిభ చాటిన వారిని ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించింది. 2023 మార్చిలో ఇంటర్, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్‌మెంట్లలో అత్యధిక మార్కులు సాధించి, మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది స్టేట్‌ బ్రిలియన్స్‌ అవార్డులు అందుకున్నారు.

Counselling for Gurukul Admissions: ఈ రెండు తేదీల్లో గురుకుల పాఠశాలల్లో చేరేందుకు కౌన్సెలింగ్‌..

ప్రభుత్వ బడుల్లో కల్పించిన సదుపాయాలు:

1. నిరంతరం నీటి సరఫరాతో మరుగుదొడ్లు
2. శుద్ధి చేసిన తాగునీరు 
3. పూర్తి స్థాయి మరమ్మతులు 
4. ఫ్యాన్లు, లైట్లతో విద్యుదీకరణ  
5. విద్యార్థులు, సిబ్బందికి ఫరి్నచర్‌ 
6. గ్రీన్‌ చాక్‌బోర్డులు 
7. భవనాలకు పెయింటింగ్‌ 
8. ఇంగ్లిష్‌ ల్యాబ్‌ 
9. కాంపౌండ్‌ వాల్‌; 10. కిచెన్‌ షెడ్‌ 
11. అదనపు తరగతి గదుల నిర్మాణం  

Annual Day Celebrations: ఉద్యాన కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు..

#Tags