Primary Education : ప్రాథ‌మిక విద్య‌కు పోటుగా మారిన స‌ర్దుబాటు..

గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం ఈదువారిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 22 మంది విద్యార్థులు చదువుతున్నారు.

చిత్తూరు: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఒకే ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నాడు. ఆ ఒక్క టీచర్‌ సెలవు పెడితే పిల్లల పరిస్థితి అయోమయం. ఇలాంటి పరిస్థితే గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో మరిన్ని పాఠశాలల్లో నెలకొంది. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ప్రత్యామ్నాయ సదుపాయాలు కల్పించకుండా సర్దుబాట్లు పేరుతో బడులను నిర్వీర్యం చేస్తున్నారు.

September 18th Holiday 2024 : గుడ్‌న్యూస్ .. సెప్టెంబర్ 17, 18న కూడా స్కూల్స్‌, కాలేజీల‌కు సెలవు.. ప్రక‌టించిన ప్ర‌భుత్వం.. ఎందుకంటే..?

● పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలం చీకలదిన్నేపల్లి, కూరగాయల కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలు. ఈ రెంటింటిలో ఒక్కొక్క పాఠశాలలో 10 మంది చొప్పున 20 మంది విద్యార్థులు ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు చదువుతున్నారు. ఏకోపాధ్యాయుడి కారణంగా ఆ రెండు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు. టీచర్ల సంఖ్యను పెంచాలని ఆ గ్రామస్తులు పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించారు. అయినా ఏ మాత్రం ఫలితం లేదు. గత్యంతరం లేక ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులను ప్రైవేటు బాట పట్టించారు.

సర్దుబాటు ప్రక్రియ సమాచారం

జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 1,024

సర్దుబాటు పొందిన స్కూల్‌ అసిస్టెంట్‌లు 184

సర్దుబాటు పొందిన ఎస్‌జీటీలు 280

మొత్తం టీచర్ల సర్దుబాటు 464

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యను బలోపేతం చేయాల్సిన కూటమి సర్కారు నిర్వీర్యం చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేపట్టిన సర్దుబాటు ప్రక్రియ ప్రాథమిక విద్యకు పోటుగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని ఎస్జీటీలను ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేశారు. ఈ ప్రక్రియ వల్ల జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలల ఉనికి అగమ్యగోచరంగా మారింది. దీంతో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య పెరగనుంది.

బలవంతంగా సబ్జెక్టు టీచర్లుగా..

జిల్లా వ్యాప్తంగా 2,467 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో గత ప్రభుత్వంలో అర్హులైన ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించి సర్దుబాటు ప్రక్రియను నిర్వహించారు. అయితే మళ్లీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మెథడాలజీ ఉన్న ఎస్‌జీటీలను బలవంతంగా సబ్జెక్టు టీచర్లుగా సర్దుబాటు చేసేసింది.

Russia Ukraine War: యుద్ధఖైదీలను పరస్పరం మార్చుకున్న రష్యా, ఉక్రెయిన్‌

ఫలితాలపై ప్రభావం

మనస్ఫూర్తిగా ఉద్యోగోన్నతి వద్దంటూ ప్రభుత్వానికి లేఖలిచ్చి ఎస్‌జీటీలుగా కొనసాగుతున్న వారిని ప్రస్తుతం స్కూల్‌ అసిస్టెంట్‌లుగా సర్దుబాటు చేశారు. గత మూడు నెలలుగా ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు పాఠాలు బోధించిన టీచర్లు ఉన్న ఫలంగా హైస్కూల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు ఎలా చెప్పగలరని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ సర్దుబాటు ప్రక్రియ పదవ తరగతి విద్యార్థుల ఫలితాలపై ప్రభావం చూపుతుందని మేధావులు చెబుతున్నారు.

డీఎస్సీ హుళక్కే?

హైస్కూళ్లలో ప్రస్తుతం ఉన్న ఖాళీలకు ఉద్యోగోన్నతులతో భర్తీ చేయాలే తప్ప బలవంతంగా ఎస్జీటీ టీచర్లకు సర్దుబాటు చేయకూడదు. ఉద్యోగోన్నతులు నిర్వహించిన తర్వాత ఏర్పడే ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి. ఉన్న టీచర్లతో సర్దుబాటు ప్రక్రియ ముగించేయడంతో డీఎస్సీ ఇంకెప్పుడు నిర్వహిస్తుందోనని బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శాపంగా మారిన సర్దుబాటు ప్రాథమిక బడులన్నీ ఇక ఏకోపాధ్యాయ పాఠశాలలే జిల్లాలో 464 మంది టీచర్ల సర్దుబాటు

టీచర్‌ పోస్టులు భర్తీ చేయలేక..

జిల్లాలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేయలేక సర్దుబాటు ప్రక్రియకు కూటమి ప్రభుత్వం తెరలేపింది. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే డీఎస్సీ నిర్వహిస్తానంటూ హడావుడిగా తొలిసంతకం చేశారు. అయితే మూడు నెలలు ముగిసినా ఇప్పటి వరకు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఊసేలేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 353 ఉన్నత పాఠశాలల్లో అవసరమైన మేరకు స్కూల్‌ అసిస్టెంట్‌లు లేకపోవడంతో జీవో 117 ప్రకారం ఎస్‌జీటీలను సర్దుబాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా హైస్కూళ్లలో మిగులుగా ఉన్న సబ్జెక్ట్‌ టీచర్లను అవసరమైన పాఠశాలలకు సర్దుబాటు చేస్తే సరిపోతుంది. కానీ ప్రభుత్వం ఇష్టానుసారంగా సర్దుబాటు ముగించిందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Job Mela: వివిధ కంపెనీల్లో పోస్టులు.. జాబ్‌మేళా, పూర్తి వివరాలు ఇవే

ప్రాథమిక విద్య నిర్వీర్యం కాకూడదు

ప్రాథమిక విద్య నిర్వీర్యం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. సర్దుబాటు ప్రక్రియను ప్రహసనంగా మార్చేశారు. సర్దుబాటు వల్ల ఎక్కువ సంఖ్యలో టీచర్లు మిగులు ఖాతాలోకి వస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల ప్రాథమిక పాఠశాలల మనుగడ ప్రశ్నార్థంగా మారింది. – బాలాజీ, ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు

సరైన నిర్ణయం కాదు

సర్దుబాటు పేరుతో ఉపాధ్యాయ పోస్టులను కుదించడం సరైన నిర్ణయం కాదు. ఇది విద్యా ప్రమాణాలకు ముప్పు. ప్రాథమిక విద్యలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఉన్నత తరగతుల్లో కూడా ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ప్రకారం ఉండాలి. అలా ఉంటేనే విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి.

– జీవీ రమణ, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

YS Jagan Mohan Reddy: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ మానుకోండి.. ఈ లేఖను వెనక్కు తీసుకోండి

#Tags