100 Days Free Coaching: పోటీ పరీక్షలకు వంద రోజుల ఉచిత శిక్షణ.. శిక్షణకు ఎంపిక ఇలా!

సాక్షి, హైదరాబాద్‌: రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ), స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ), బ్యాంకింగ్‌ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న బీసీ అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ వందరోజుల ఉచిత శిక్షణ ఇవ్వనుంది.

ఆయా ఉద్యోగాలకు సిద్ధమవుతున్న బీసీ అభ్యర్థులు ఫిబ్రవరి 9లోపు ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని స్టడీసర్కిల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి జ‌న‌వ‌రి 16న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

చదవండి: ఆర్‌ఆర్‌బీ పరీక్షలు - స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | వీడియోస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | కరెంట్‌ అఫైర్స్‌ | జనరల్ ఎస్సే | జనరల్‌ నాలెడ్జ్‌

గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల్లోపు ఉండాలని సూచించారు. జ‌న‌వ‌రి 20 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ మార్కులను అర్హతగా తీసుకుని శిక్షణకు ఎంపిక చేస్తామన్నారు. వివరాలకు బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం లేదా బీసీ స్టడీసర్కిల్‌ వెబ్‌సైట్‌లో సంప్రదించాలన్నారు.   

చదవండి: ఎస్‌ఎస్‌సీ పరీక్షలు - గైడెన్స్ | న్యూస్‌ | ప్రివియస్‌ పేపర్స్ | వీడియోస్

చదవండి: బ్యాంక్‌ పరీక్షలు - సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | న్యూస్ | ప్రశ్నలు - సమాధానాలు | ఆన్‌లైన్ టెస్ట్స్ | వీడియోస్

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags