RPF Constable Admit Card Download : ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ అడ్మిట్ కార్డు విడుదల.. ఆర్ఆర్‌బీ కీలక ఆదేశాలు..

సాక్షి ఎడ్యుకేషన్: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) సెన్ (CEN) 02/2024 కింద నియామక పరీక్ష కోసం ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ అడ్మిట్ కార్డ్ 2025ను విడుదల చేసింది. ఫిబ్రవరి 27వ తేదీ.. నేడు విడుదలైన అడ్మిట్ కార్డును మార్చి 2వ తేదీన ఆదివారం నిర్వహించే ఆర్‌పీఎఫ్ పరీక్షకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు అధికారులు.
ఆర్ఆర్‌బీ నిర్వహించే ఈ పరీక్షతో, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో అనేక ఖాళీలను భర్తీ చేయనున్నారు. పరీక్షా ప్రక్రియ సజావుగా జరిగేలా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
SSC GD Exam 2025 Answer Key : ఎస్ఎస్‌సీ జీడీ ఆన్సర్ కీపై అప్‌డేట్.. డౌన్‌లోడ్ విధానం ఇదే..
పరీక్షలో అభ్యర్థులు పూర్తిగా సిద్ధం కావాలని, ఆర్ఆర్‌బీ అందించిన మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. ఆర్‌పీఎఫ్ పరీక్షకు అడ్మిట్ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు అధికారులు. ఈ అడ్మిట్ కార్డును ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్.. rrb.digialm.com నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ విధానం:
1. ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్.. rrb.digialm.com.ను సందర్శించండి.
2. ఇక్కడ, మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
3. డౌన్‌లోడ్ అడ్మిట్ కార్డుపై క్లిక్ చేయండి.
TG EAPCET 2025: టీజీ ఈఏపీసెట్–2025.. దరఖాస్తులకు చివరితేది ఇదే!
4. మీ అడ్మిట్ కార్డు కనిపిస్తుంది. ఇక, దానిని పూర్తిగా పరిశీలించి, డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోండి.
అభ్యర్థులు అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత అందులో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే, వెంటనే సహాయం కోసం సంబంధిత ఆర్ఆర్‌బీ ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించాలి. పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను తప్పకుండా పరిశీలిస్తూనే ఉండాలి.
తప్పనిసరిగా తీసుకెళ్లాలి..
అభ్యర్థులు పరీక్ష రాసేందుకు కేంద్రానికి అడ్మిట్ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డు లేకుండా కేంద్రంలోకి ప్రవేశం ఉండదని గుర్తు పెట్టుకోవాలి. అంతేకాదు, అభ్యర్థులు వారి వెంట.. అడ్మిట్ కార్డుతో పాటు, ధృవీకరణ ప్రయోజనాల కోసం వారి ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఫోటో ఐడి ప్రూఫ్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- rrb exams 2025
- Competitive Exams
- rpf constable exam
- admit card download
- rpf admit card download 2025
- rrb exams latest update 2025
- admit card download process for rpf exam
- rpf constable exam 2025 admit card download
- march 2nd
- railway recruitment board exams 2025
- rrb latest update on rpf exam
- rpf constable exam latest update
- RPF Exam 2025
- RPF Admit Card Download
- Education News
- Sakshi Education News