Railway Jobs: రైల్వేలో 32 వేల ఉద్యోగాలు.. 10వ తరగతి పాసైన వారు కూడా అర్హులు..

రైల్వే బోర్డు నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.

రైల్వే శాఖలోని పలు విభాగాల్లో.. పాయింట్స్‌మెన్‌, అసిస్టెంట్‌, ట్రాక్‌ మెయింటెయినర్‌ సహా 32,000 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే బోర్డు లెవెల్-1 (గ్రూప్-డీ) పోస్టులకు కనీస విద్యార్హత నిబంధనలను సడలించింది. 

కొత్త నిబంధనల ప్రకారం.. 10వ తరగతి పాసైన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అదనంగా, ఐటీఐ డిప్లొమా లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) మంజూరు చేసిన నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) కలిగిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు.

ఇప్పటివరకు.. టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయాలంటే పదో తరగతి ఉత్తీర్ణత, ఎన్ఏసీ లేదా ఐటీఐ డిప్లొమా ఉండాల్సిన నిబంధనలు ఉన్నాయి. అయితే, ఈ పాత నిబంధనలను రైల్వే బోర్డు తాజాగా రద్దు చేసింది. ఈ కొత్త నిర్ణయం బట్టి 32000 లెవెల్-1 పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. 

దరఖాస్తు ప్రక్రియ: జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు..

వయో పరిమితి: ఈ పోస్టుల భర్తీకి 18-36 ఏళ్లు మధ్య వయస్సు ఉండాలి (2025 జనవరి 7 నాటికి). ఎస్‌సి, ఎస్‌టి, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఇవ్వబడింది.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రారంభ వేతనం: నెలకు రూ.18,000 వరకు..

వెబ్‌సైట్‌: https://indianrailways.gov.in

Directorate of Medical Education jobs: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌లో 1289 ఉద్యోగాలు జీతం నెలకు 80500

#Tags