Indian Railway Recruitments : భార‌తీయ రైల్వేలో 4232 ఉద్యోగాలు.. ఈ అర్హ‌త‌ల‌తోనే ఎంపిక‌..!!

నిరుద్యోగులకు, ఉద్యోగావ‌కాశం కోసం ఎదురు చూస్తున్న యువ‌త‌కు భారతీయ రైల్వే భారీ నోటిఫికేష‌న్‌తో శుభవార్త ప్ర‌క‌టించింది.

సాక్షి ఎడ్యుకేష‌న్: నిరుద్యోగులకు, ఉద్యోగావ‌కాశం కోసం ఎదురు చూస్తున్న యువ‌త‌కు భారతీయ రైల్వే భారీ నోటిఫికేష‌న్‌తో శుభవార్త ప్ర‌క‌టించింది. తాజాగా, దక్షిణ మధ్య రైల్వేలో 4232 అప్రెంటిస్ ఉద్యోగాలు ఖాళీగా ఉండగా అందుకు సంబంధించిన జాబ్‌ నోటిఫికేషన్‌ను విడుద‌ల చేసింది.
పోస్టుల వివ‌రాల్లోకి వ‌స్తే..

ద‌క్షిణ మ‌ధ్య రైల్వేలో 4232 అప్రెంటీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Job Mela For Freshers: పదో తరగతి అర్హతతో ఉద్యోగం.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

50 శాతం మార్కులతో..

ఉద్యోగ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వర్క్షాప్ యూనిట్లలో అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలు పొందాలంటే ఐటీఐ పాసై ఉండాలి. ఇందులో వారికి కనీసం 50 శాతం మార్కులు సాధించి, పది పాస్ కావడంతోపాటు, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థులు ఆన్‌లైన్ వేదికగా ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. 

వివిధ ప్రాంతాల్లో..

ఉద్యోగ‌ల‌కు ఎంపికైన‌ అభ్యర్థులకు.. సికింద్రాబాద్, లాలాగూడ, మెట్టుగూడ, ఖాజీపేట్, హైదరాబాద్, విజయవాడ, బిట్రగుంట, గూడూరు జంక్షన్, కాకినాడ పోర్టు, కొండపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్, ఒంగోలు, రాజమండ్రి, రాయనపాడు, నల్లపాడు, గుంటూరు, గుంతకల్, తిమ్మనచర్ల, యాద్గిర్, నాందేడ్, పూర్ణ జంక్షన్, ముద్ఖేడ్ ప్రాంతాల్లో ఉద్యోగాలను కేటాయిస్తారు.

TG Court Jobs Applications 2025 : 1673 కోర్టు ఉద్యోగాలు.. ఇలా ఫాలో అయి దరఖాస్తు చేసుకోండి...

రిజర్వేషన్ ఆధారంగా..

ఎస్సీ-635, ఎసీ-317, ఓబీసీ -1143, ఈడబ్ల్యూఎస్-423, యూఆర్-1714 ఉద్యోగాలు కేటాయిస్తారు. ఇక అభ్యర్థులు 2024 డిసెంబర్ 28 నాటికి 15 నుంచి 24 సంవత్సరాలుండాలి. టెన్త్, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా సెక్షన్ ఉంటుంది. ఓబీసీలకు మూడు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంది. అప్లికేషన్ చివరి తేది 2025 జనవరి 27. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ scr.indianrailways.gov.in/ సంప్రదించండి.

Jobs Abroad: విదేశాల్లో ఉపాధి పొందాలనుకునే వారికి శుభవార్త.. ఇక ఏజెంట్ల మోసాల‌కు చెక్‌ ఇలా..

ఉద్యోగాల డిపార్ట్ మెంట్స్..

ఏసీ మెకానిక్ - 143, ఎయిర్ కండీషనింగ్ - 32, కార్పెంటర్ - 42, డీజిల్ మెకానిక్ - 142, ఎలక్ట్రికల్ మెకానిక్ - 85, ఇండస్ట్రియల్ ఎలకాట్రనిక్స్ - 10, పెయింటర్ - 74, పవర్ మెయింటెనెన్స్ (ఎలక్ట్రీషియన్) - 34, ఎలక్ట్రీషియన్ - 1053, ఎలక్ట్రికల్(S&T) (ఎలక్ట్రీషియన్) - 10, ఫిట్టర్ - 1742, ట్రైన్ లైటింగ్(ఎలక్ట్రీషియన్) - 34, మెషినిస్ట్ - 100, మోటార్ మెకానిక్ మెహికిల్ - 08, వెల్డర్ - 713, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ - 10.. ఇలా మొత్తం 4232 పోస్టులున్నాయి.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ..

దక్షిణ మధ్య రైల్వేలోకి వచ్చే జిల్లాల అభ్యర్థులు మాత్రమే 2025 జనవరి 27లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags