Job Mela: ఉపాధి కార్యాలయ శాఖ ఆధ్వర్యంలో 6న జాబ్‌మేళా
భూపాలపల్లి అర్బన్: మార్చి 6వ తేదీన జిల్లా ఉపాధి కార్యాలయ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆరూరి శ్యామల మార్చి 1న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అపోలో ఫార్మసీలో ఫార్మసిస్టు, ట్రైనీ ఫార్మసిస్టు, రిటైల్ ట్రైనీ అసోసియేట్, ప్రొడక్ట్ అడ్వజర్ 170 ఉద్యోగాల ఎంపికకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. 18 సంవత్సరాల పైబడిన నిరుద్యోగ యువతీ యువకులు అర్హులన్నారు.
చదవండి: TSPSC Group 1 Notification: తెలంగాణలో 563 గ్రూప్–1 పోస్టులు.. ప్రిలిమ్స్ పరీక్ష ఆ రోజునే!
అర్హత, ఆసక్తి కలిగిన యువతీ, యువకులు విద్యార్హతలు, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డ్, పాన్‌కార్డు ఇతర పత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. వివరాలకు 97010 78288, 7702457968 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
#Tags