NEET 2025 : నీట్ 2025 ప‌రీక్ష తేదీ ఖ‌రారు.. ఈ విష‌యాల‌పై ఎన్ఎంసీ స్ప‌ష్ట‌త‌..!

వైద్య విద్య‌ను పొందేందుకు విద్యార్థుల‌కు నిర్వ‌హించే అతి ప్రాముఖ్య‌త క‌లిగిన ప‌రీక్ష నీట్‌.

సాక్షి ఎడ్యుకేష‌న్: నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (నీట్‌) ప‌రీక్ష‌ను 12వ త‌ర‌గ‌తి విద్యార్థులకు మెడికల్ కోర్సులలో, ముఖ్యంగా ఎంబీబీఎస్, బిడీఎస్, బీఎంఎస్, ఆయుర్వేద, యోగా, న్యాచరల్ ఔషధం కోర్సుల్లో ప్ర‌వేశం పొందేందుకు ఉత్తీర్ణ‌త సాధించాల్సిన ప‌రీక్ష‌.

Merit List Released: వైద్య, ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీ.. అభ్యర్థుల మెరిట్‌ జాబితా విడుదల

దీంతో వారికి నీట్ కోర్సులో ప్ర‌వేశం ద‌క్కుతుంది. అటువంటి ఈ ప‌రీక్ష‌ను ప్ర‌తీ ఏటా నిర్వ‌హిస్తుంది ప్ర‌భుత్వం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరై తమ ప్రతిభను ప్రదర్శిస్తారు ఈ పరీక్ష‌లో. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా 2000కి పైగా కేంద్రాల్లో నిర్వహిస్తారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ప్ర‌స్తుతం, 2025కు సంబంధించిన నీట్ పరీక్ష తేదీలు విడుదల అయ్యాయి. వ‌చ్చే ఏడాది జూన్ 15వ తేదీన ప్రారంభం కానున్న‌ట్లు నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు ప్ర‌క‌టించింది. 

విదేశీ వైద్య‌విద్య పొందాలంటే..

విదేశాల్లో వైద్యవిద్య కోర్సుల్లో ప్ర‌వేశం పొందాలంటే, అనుమతి పొందిన మెడికల్‌ కాలేజీల్లోనే సీట్లు పొందాలని నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్ (ఎన్ఎంసీ) స్పష్టం చేసింది. నిర్దేశిత గడువులోగా వైద్యవిద్య పూర్తి, క్లినికల్, నాన్‌ క్లినికల్‌ అంశాల్లో శిక్షణ పొందాలి. కొన్ని దేశాల్లో కొన్ని కళాశాలలు మాత్రం ఎమ్‌ఎన్‌సీ మార్గదర్శకాలను అమలు చేయడం లేదు.

PG Medical Admissions: ఏం చేద్దాం?.. హైకోర్టు తీర్పుతో కౌన్సెలింగ్‌పై సర్కార్‌ సమాలోచనలు.. అస‌లు వివాదం ఇదీ..

అటువంటి వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ వైద్యవిద్యను పూర్తి చేసి భారత్‌కు వస్తే ఇక్కడ ఇంటర్న్‌షిప్‌ చేయడానికి ఎన్‌ఎంసీ నిబంధనలు అంగీకరించవని స్పష్టం చేసింది. వీటన్నిటి ఆలోచించుకుని విదేశాల్లో వైద్యవిద్య కోసం వెళ్లాలి. ఒకవేళ వెళ్లాలి అనుకుంటే విద్యార్థులు ముందుగా ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లో సంబంధిత కళాశాలకు అనుమతి ఉందో లేదో చూసుకోవాలి.

దేశవ్యాప్తంగా ఉన్న 52 వేల పీజీ సీట్ల కోసం సుమారు 2 లక్షల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు పోటీపడుతున్నారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags