Doctor Posts: గాంధీ, ఉస్మానియాల్లో 235 డాక్టర్‌ పోస్టుల భర్తీ.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో వివిధ కేటగిరీల్లో డాక్టర్ల భర్తీకి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ.. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్ల పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనుంది.

Jaya Sucess Story: వ్యవసాయ కుటుంబం​.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన జయ

ఇందులో భాగంగా నోటిఫికేషన్‌ విడుదల చేసిన అధికారులు.. ఈనెల 9వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 12వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన, 13న అభ్యంతరాల స్వీకరణ, 14వ తేదీన నియామకపత్రాలు ఇవ్వనున్నారు.ఈ రెండు ఆస్పత్రుల్లో 235 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇందులో ఉస్మానియాలో 8 ప్రొఫెసర్‌ పోస్టులు, 23 అసోసియేట్‌ ప్రొఫెసర్, 111 అసిస్టెంట్‌ ప్రొఫెసర్, 33 సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు.

Indian Army Jobs Recruitment 2024 : ఆగస్టు 23వ తేదీ నుంచి భారీగా ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ.. ఎక్కడంటే..?

అదేవిధంగా గాంధీ ఆస్పత్రిలో 3 ప్రొఫెసర్, 29 అసిస్టెంట్‌ ప్రొఫెసర్, 24 సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు, 4 ట్యూటర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈనెల 9న గాంధీ మెడికల్‌ కాలేజీ పరిపాలన భవనంలో డైరెక్టర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ సమక్షంలో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అలాగే ఉస్మానియా మెడికల్‌ కాలేజీ అకడమిక్‌ బ్లాక్‌లో కమిషనర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ సమక్షంలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి.

#Tags