Microsoft Job: మైక్రోసాఫ్ట్‌లో జాబ్‌.. ఏడాదికే షాక్‌..!

అందరు ఉద్యోగం చేయాలన్న కలలను సాకారం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలను చేస్తారు. చివరికి అది ఫలిస్తే ఎంతో సంతోషిస్తారు. కానీ, ఈ మహళ ఏం చేసిందో తెలుసా..

గజినీ మహమ్మద్ 17 సార్లు భారతదేశం మీద దండయాత్ర చేసాడని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం, అయితే ఓ మహిళ ఉద్యోగం కోసం ఏకంగా 30 కంటే ఎక్కువ సార్లు ఒకే కంపెనీకి అప్లై చేసి ఉద్యోగం సాధించింది, జాబ్‌లో చేరిన కేవలం ఏడాదికే రాజీనామా చేసి అందరికి షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలును తెలుసుకుందాం..

Schools in Village: ఈ గ్రామంలో బడి 50 ఏళ్ళనాటిది.. ఇప్పుడు ఇది పరిస్థితి..

పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి ప్రాంతానికి చెందిన 'హిమాంతిక మిత్రా' (Haimantika Mitra) బెంగళూరులో నివశిస్తూ.. మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేయాలని దాదాపు 30 కంటే ఎక్కువ సార్లు అప్లై చేసుకుని, పట్టువదలని విక్రమార్కుని మాదిరిగా చివరకు అనుకున్నట్లుగానే ఉద్యోగంలో చేరింది.

30 సార్లు ఉద్యోగానికి అప్లై చేసి జాబ్ తెచ్చుకున్న హిమాంతిక కేవలం ఒక సంవత్సరం మాత్రమే అక్కడ పనిచేసి రాజీనామా చేసి కంపెనీకి మాత్రమే కాకుండా.. కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా అవాక్కయ్యేలా చేసింది.

మైక్రోసాఫ్ట్ కంపెనీ 2020లో దేశవ్యాప్తంగా నిర్వహించిన హ్యాకథాన్ కార్యక్రమంలో పాల్గొనేవారి నుంచి సపోర్ట్ ఇంజినీర్లను ఎంపిక చేసుకోనున్నట్లు తెలుసుకుని మిత్రా జాబ్‌కి అప్లై చేసింది. అప్పుడు మొత్తం 11,000 మంది జాబ్ కోసం అప్లై చేసుకోగా.. చివరి రౌండ్లో మిత్రా సెలక్ట్ కాలేకపోయింది.

Andhra Pradesh: ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు చివ‌రి తేదీ ఇదే..

కంపెనీ ఆమె పనితీరుని చూసి మైక్రోసాఫ్ట్ రిక్రూటర్లు ఇంటర్వ్యూ చేయడానికి అంగీకరించారు, ఇందులో భాగంగానే 2021 ఏప్రిల్ నుంచి ఇంటర్న్‌షిప్‌ అనుకున్నట్లుగానే చివరకు ఇంటర్వ్యూలో నెగ్గి జాబ్ కొట్టేసింది. ఇంత కష్టపడి ఉద్యోగంలో చేరిన సంవత్సరం తరువాత మైక్రోసాఫ్ట్ కంటే మంచి కంపెనీలో.. మంచి పొజిషన్‌లో ఉండాలనే ఉద్దేశ్యంతో జాబ్ వదిలిసినట్లు తెలిపింది.  భవిష్యత్తులో మళ్ళీ మైక్రోసాఫ్ట్‌లో అడుగు పెడతానని కూడా మిత్రా వెల్లడించింది.

#Tags