Big Breaking: కానిస్టేబుల్ ఫిజిక‌ల్ ఎఫిషియెన్సీ టెస్ట్ వాయిదా... కొత్త తేదీలు విడుద‌ల చేసిన సీఆర్‌పీఎఫ్‌

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) గతేడాది నవంబర్‌లో వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఉద్యోగాల‌కు పదో తరగతే విద్యార్హత. దీంతో ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
Police Physical Test

బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎస్‌ఎస్‌సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహించగా ఇటీవల ఫలితాలు వెలువడ్డాయి.


ఇ-అడ్మిట్ కార్డు ఉంటేనే అనుమ‌తి
రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పీఎస్‌టీ, పీఈటీలను ఏప్రిల్‌ 24 నుంచి మే 8 వరకు నిర్వహించనున్నట్లు సీఆర్‌పీఎఫ్ ప్రకటించింది. అయితే వీటిని వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. శారీరక సామర్థ్య పరీక్షలను మే 1 తర్వాత నిర్వ‌హించ‌నున్నట్లు వెల్లడించింది.

వాయిదా పడిన సమాచారాన్ని ఫిజికల్‌ టెస్టుకు ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్‌ ద్వారా అంద‌జేయ‌నుంది. త్వరలోనే ఇ-అడ్మిట్ కార్డును అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు సీఆర్‌పీఎఫ్‌ స్పష్టం చేసింది. ఇ-అడ్మిట్ కార్డు ఉంటేనే పీఎస్‌టీ/ పీఈటీలకు అనుమతినిస్తారు.

చ‌ద‌వండి: 50,187 కానిస్టేబుల్ పోస్టులు.. ఎంపికైతే రూ.69,100 వ‌ర‌కు జీతం.. అర్హ‌త‌లు ఇవే..
నోట్‌: https://rect.crpf.gov.in/ సైట్‌లో అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

#Tags