Nursing Jobs: నర్సింగ్‌ ఉద్యోగ అవకాశాలు.. జాపనీస్‌ భాషలో శిక్షణ..

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ), నావిస్‌ హెచ్‌ఆర్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసిన అధ్యర్థులకు జపాన్‌లో కేర్‌ వర్కర్స్‌ ఇన్‌ హాస్పి టల్స్‌, కేర్‌ హోం ఫెసిలిటీగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.ప్రణయ్ మార్చి 11వ తేదీ ఓ ప్రకటనలో తెలిపారు.

ఇందుకు గాను బెంగుళూరులో ఆరు సంవ‌త్స‌రాల‌ కాల వ్యవధిలో జపనీస్‌ భాషలో శిక్షణతో పాటు ఎన్‌5, ఎన్‌4, ఎన్‌3 నైపుణ్యాల్లో రెసిడెన్షియల్‌ తరహాలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఒక్కో అభ్యర్థికి రూ.3.50 లక్షల వ్యయం కాగల ప్రోగ్రామ్‌ ఫీజులో రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.50 వేలు కలిసి ఉంటుందని తెలిపారు. ఇందులో అభ్యర్థి రూ.3.25 లక్షలు భరించాల్సి ఉండగా, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒక్కో అభ్యర్థికి రూ.25 వేలను చెల్లిస్తుందని వివరించారు. 

శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జపాన్‌ దేశం నుంచి సంబంధిత రంగానికి చెందిన నిపుణులు వచ్చి శిక్షణ కల్పిస్తారని తెలిపారు. అభ్యర్థులు చెల్లించే మొత్తానికి ఆర్నెల్ల వ్యవధిలో జపనీస్‌ భాషలో శిక్షణ, నైపుణ్యాలతో పాటు జపనీస్‌ కల్చర్‌, మ్యానరిజం, మర్యాదగా వ్యవహరించే విధానం, క్లయింట్‌ ఇంటర్వ్యూ తయారీ, పరీక్ష తయారీ, పరీక్ష రుసుం, ప్లేస్‌మెంట్‌ ఇంటర్వ్యూ సపోర్ట్‌, వీసా స్టాంపింగ్‌ సపోర్ట్‌తో పాటు సదరు అభ్యర్థిని జపాన్‌కు పంపే వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. 

Physiotherapist Jobs: ఫిజియోథెరపిస్ట్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

శిక్షణ పూర్తయిన అభ్యర్థులకు వీసా కోసం డాక్యుమెంటేషన్‌, సహాయం కోసం ఎంబసీతో సమన్వయం, శిక్షణ ఉంటాయని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు httpr//www.aprrdc.in/home/oninePsofram Qefirtration సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, ఇతర వివరాలకు 9491435004 సంప్రదించాలని సూచించారు.

#Tags